Telugu Global
National

రైళ్ళలో ఇక ఆటో లాకింగ్‌ డోర్‌ సిస్టమ్‌!

కదిలే రైళ్ళను ఎక్కేందుకు చేసే ప్రయత్నం… రైలు ఆగకుండానే దిగే ప్రయత్నం చేయడంలో అనేకమంది ప్రయాణికులు ప్రమాదాలకు గురవడం, ఫలితంగా కాళ్ళో, ప్రాణాలో పోగొట్టుకోవడం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు రైల్వే శాఖ ఓ ఆలోచన చేసింది. ఇక నుంచి రైళ్ళలో ఉండే తలుపులకు కూడా సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సెంట్రల్‌ ఆపరేషన్‌ సిస్టమ్‌తో స్టేషన్‌ వచ్చినప్పుడు ఈ తలుపులు వాటికవే తెరచుకుంటాయి… లేదా మూసుకుంటాయి. అంటే ఇపుడు కొన్ని నగరాల్లో మెట్రో రైళ్ళకు, […]

రైళ్ళలో ఇక ఆటో లాకింగ్‌ డోర్‌ సిస్టమ్‌!
X

కదిలే రైళ్ళను ఎక్కేందుకు చేసే ప్రయత్నం… రైలు ఆగకుండానే దిగే ప్రయత్నం చేయడంలో అనేకమంది ప్రయాణికులు ప్రమాదాలకు గురవడం, ఫలితంగా కాళ్ళో, ప్రాణాలో పోగొట్టుకోవడం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు రైల్వే శాఖ ఓ ఆలోచన చేసింది. ఇక నుంచి రైళ్ళలో ఉండే తలుపులకు కూడా సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సెంట్రల్‌ ఆపరేషన్‌ సిస్టమ్‌తో స్టేషన్‌ వచ్చినప్పుడు ఈ తలుపులు వాటికవే తెరచుకుంటాయి… లేదా మూసుకుంటాయి. అంటే ఇపుడు కొన్ని నగరాల్లో మెట్రో రైళ్ళకు, ఢిల్లీలోని డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో కింద ఫ్లోర్‌కి ఉన్నట్టు అన్న మాట. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇప్పటికే ఈ డోర్లు ఏర్పాటుతో నమూనా కోచ్‌లు తయారు చేసింది. దీనికి సంబంధించి టెండర్లు కూడా కేటాయింపు అయిపోయింది. ఈ సెంట్రల్‌ ఆపరేషన్‌ సిస్టమ్‌ డోర్ల వల్ల అనేక ఉపయోగాలుంటాయని, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా రక్షించడానికి, దొంగలు అకస్మాత్తుగా కోచ్‌లలో ప్రవేశింపకుండా చేయడానికి రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఒక కోచ్‌లో ఏర్పాటు చేయాల్సిన నాలుగు డోర్లకు దాదాపు రూ. 12 లక్షల ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి కొన్ని రైళ్ళలో ఈ సిస్టమ్‌తో డోర్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

First Published:  24 Oct 2015 4:01 AM GMT
Next Story