Telugu Global
Others

ఇలా చేస్తే...ఎంతకాలం బతుకుతామో తెలిసిపోతుందట!

మీ వయసు యాభై సంవత్సరాలు దాటి ఉంటే మీరు ఇంకెంత కాలం బతుకుతారు… అనే విషయాన్నిఒక చిన్నపాటి టెస్టు విప్పి చెప్పేస్తుంది అంటున్నారు బ్రెజిల్‌కి చెందిన ఫిజిషియన్ క్లాడియో గిల్ అరాజో. అతి తేలిగ్గా, ఎలాంటి పరికరాలు లేకుండా, ఇంట్లోనే కొన్ని క్షణాలపాటు, త‌మ‌కు తాము నిర్వ‌హించుకోగ‌ల చిన్న‌ప‌రీక్ష ఇది. అరాజో దీన్ని తన పేషంట్లకు నిర్వహించి ఫలితాలు నిర్ధారించుకున్నారు. తనవద్దకు వచ్చే వయసు మళ్లిన పేషంట్లలో, కిందపడిన వస్తువుని వంగి తీయలేకపోవడం, శ‌రీరాన్ని బ్యాల‌న్స్ చేసుకోలేక‌పోవ‌డం, కుర్చీలోంచి త్వరగా లేవలేకపోవడం లాంటి లక్షణాలను […]

ఇలా చేస్తే...ఎంతకాలం బతుకుతామో తెలిసిపోతుందట!
X

మీ వయసు యాభై సంవత్సరాలు దాటి ఉంటే మీరు ఇంకెంత కాలం బతుకుతారు… అనే విషయాన్నిఒక చిన్నపాటి టెస్టు విప్పి చెప్పేస్తుంది అంటున్నారు బ్రెజిల్‌కి చెందిన ఫిజిషియన్ క్లాడియో గిల్ అరాజో. అతి తేలిగ్గా, ఎలాంటి పరికరాలు లేకుండా, ఇంట్లోనే కొన్ని క్షణాలపాటు, త‌మ‌కు తాము నిర్వ‌హించుకోగ‌ల చిన్న‌ప‌రీక్ష ఇది. అరాజో దీన్ని తన పేషంట్లకు నిర్వహించి ఫలితాలు నిర్ధారించుకున్నారు.

తనవద్దకు వచ్చే వయసు మళ్లిన పేషంట్లలో, కిందపడిన వస్తువుని వంగి తీయలేకపోవడం, శ‌రీరాన్ని బ్యాల‌న్స్ చేసుకోలేక‌పోవ‌డం, కుర్చీలోంచి త్వరగా లేవలేకపోవడం లాంటి లక్షణాలను గమనించేవారు ఆయన. ఇలాంటి లక్షణాలు ఉన్నపుడు కిందపడిపోవడం, యాక్సిడెంట్లకు గురికావడం, అలాగే గుండె సంబంధ వ్యాధులకు లోన‌వ‌డం… లాంటి ప్రమాదాలు సైతం ఉంటాయి. ఈ త‌ర‌హా శారీరక ప‌టుత్వ లోపాలు అనుభ‌వించిన త‌రువాత వీరి జీవిత‌కాలం త‌గ్గిపోతుండ‌టం చూశాక అరాజోకి ఒక ఆలోచ‌న వ‌చ్చింది.

శ‌రీరంలో చురుకుద‌నం, ప‌టుత్వం, ఫ్లెక్సిబిలిటీ, బ్యాల‌న్స్‌, చ‌క్క‌ని ఆకారం ఇవ‌న్నీ మ‌నిషి జీవిత‌కాలాన్ని నిర్దేశిస్తున్నాయి… క‌నుక మ‌నిషిలో ఇవ‌న్నీ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుంటే వారి జీవిత‌కాలాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చ‌నేది ఆ ఆలోచ‌న‌. ఈ పాజిటివ్ ల‌క్ష‌ణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు అవ‌స‌ర‌మైన చిన్న ప‌రీక్ష‌ను ఆయ‌న క‌నుగొన‌గ‌లిగారు.

Exercise modelఇక్క‌డ క‌న‌బ‌డుతున్న చిత్రంలో చూపిన‌ట్టుగా నిటారుగా నిల‌బ‌డి చేతుల‌ను ఏమాత్రం ఉప‌యోగించ‌కుండా కింద కూర్చోగ‌ల‌గ‌డం, అలాగే చేతుల స‌హాయం లేకుండానే కింద‌నుండి పైకి లేవ‌డం…ఇదే ఆ ప‌రీక్ష‌. వ‌దులుగా ఉన్న దుస్తులు ధ‌రించి, గ‌ది మ‌ధ్య‌లో విశాల‌మైన ప్ర‌దేశంలో నిల‌బ‌డి చేతుల‌ను దూరంగా ఉంచి కాళ్ల‌ను బాసింప‌ట్టుతో కూర్చోవ‌డానికి వీలుగా క్రాస్ చేయాలి. ఇప్పుడు నిదానంగా కింద కూర్చునే ప్ర‌య‌త్నం చేయాలి. అలా కూర్చున్నాక చిత్రంలో చూపిన‌ట్టుగా చేతులు, మోకాళ్లు వాడ‌కుండా పైకి లేచి నిల‌బ‌డాలి.

ఈ ప‌రీక్ష‌కు మ‌నం ఇచ్చుకోవాల్సిన మొత్తం పాయింట్లు ప‌ది. నిల‌బ‌డినందుకు ఐదు, కూర్చోగ‌లిగినందుకు ఐదు. ఈ ప‌రీక్ష స‌మ‌యంలో బ్యాల‌న్స్ చేసుకునేందుకు చేతిని లేదా మోకాలుని వాడిన‌ప్పుడ‌ల్లా ఒక పాయింటుని త‌గ్గించుకోవాలి. అలాగే బ్యాల‌న్స్ కోల్పోయి ప‌డిపోబోయి నిల‌దొక్కుకున్నా లేదా పాదాలు త‌మ స్థానాన్ని కోల్పోయి అటు ఇటు అయినా ఒక అర‌పాయింటు చొప్పున త‌గ్గించుకోవాలి. ఈ ప‌రీక్ష చాలా చిన్న‌పాటిదిగా సింపుల్‌గా క‌న‌బ‌డుతున్నా, ఇది మ‌న జీవిత‌కాలాన్ని అంచ‌నా వేయ‌డంలో చాలా చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, మ‌న శ‌రీరం అనే యంత్రం ఏ కండిష‌న్లో ఉందో చెప్పేస్తుంద‌ని అరాజో అంటున్నారు. ఎందుకంటే ఇదే ప‌రీక్ష‌ని ఆయ‌న త‌న పేషంట్లు దాదాపు 2వేల‌మంది మీద‌ నిర్వ‌హించారు. వీరంతా 51-80 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న‌వారు.

unnamed (1)ఇందులో ఇంత‌కుముందు చెప్పిన విధానంలో పాయింట్లు తీసేయ‌గా ఎనిమిది కంటే త‌క్కువ పాయింట్లు తెచ్చుకున్న‌వారు త‌రువాతి ఆరేళ్ల‌లో మ‌ర‌ణించే ప్ర‌మాదం రెండింత‌లు పెరుగుతుంద‌ని, అలాగే మూడు లేక అంత‌కంటే త‌క్కువ పాయింట్లు తెచ్చుకున్న‌వారు త‌రువాతి ఆరేళ్ల‌లో ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదం ఐదింత‌లు పెరుగుతుంద‌ని అరాజో వివ‌రిస్తున్నారు. ఈ ప‌రీక్ష‌లో పాల్గొన్న‌వారు సాధించే ప్ర‌తిపాయింటు వారిని మ‌ర‌ణ ప్ర‌మాదం నుండి 21 శాతం మేర‌కు దూరంగా ఉంచుతుంద‌ని ఆయ‌న విశ్లేష‌ణ‌.

అయితే ఈ ప‌రీక్ష‌ 50 సంవ‌త్స‌రాలు దాటిన‌వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. కానీ వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల‌వారికి ఇది వారి ఆరోగ్య‌స్థాయిని గురించి తెలియ‌జేస్తుంద‌ని అరాజో చెబుతున్నారు. ఒక‌వేళ 50 ఏళ్లు దాట‌నివారు ఈ ప‌రీక్ష‌లో ఎక్కువ పాయింట్లు సాధించ‌లేక‌పోతే అదివారికి ఆరోగ్య‌ప‌రంగా వేక‌ప్‌కాల్‌గానే భావించాల‌ని అరాజో హెచ్చ‌రిస్తున్నారు. ఇక్క‌డ ఆయ‌న ముఖ్యంగా ప్ర‌స్తావిస్తున్న సంగ‌తి ఒక‌టుంది. శ‌రీరం ఫిట్‌గా ఉన్న‌వారు ఈ ప‌రీక్ష‌లో ఈజీగా పాస‌యిపోతారు. అంటే శ‌రీరం, ఫిట్‌గా మంచి ఆకృతితో, అందంగా, సౌష్ట‌వంగా ఉండ‌టం మ‌న జీవిత‌కాలాన్ని పొడిగిస్తుంద‌ని అర్థం చేసుకోవాలి. కానీ అలా ఫిట్‌గా, అందంగా, సౌష్ట‌వంగా ఉండండి… అని చెబితే ఎవ‌రైనా అశ్ర‌ద్ధ చేస్తారు… అందుకే ఆ ఫిట్‌నెస్సే ప్రాణాల‌ను కాపాడే మార్గ‌మ‌ని ఇలా ఈ ప‌రీక్ష ద్వారా హెచ్చ‌రిక చేయాల్సివ‌చ్చింద‌ని ఆయ‌న చెబుతున్నారు.

First Published:  24 Oct 2015 3:25 AM GMT
Next Story