Telugu Global
National

యుద్ధ విమానాలకు ఇక మహిళా పైలెట్లు

ఇకపై యుద్ధ విమానాలను మహిళలు కూడా నడపనున్నారు. ఇప్పటివరకు వాయుసేనలోని రవాణ, హెలికాప్టర్ల విభాగాల్లో మాత్రమే మహిళలు సేవలందిస్తున్నారు. వారి పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో వారి సేవలను ఇక రక్షణ శాఖ, ఫైటర్ జెట్లలో కూడా వినియోగించుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత వాయు సేనలో మహిళా ఫైటర్ పైలెట్ల ప్రవేశానికి కేంద్రం ఆమోదం తెలిపినట్టు వాయుసేన వర్గాలు తెలిపాయి. దీంతో ఇకపై యుద్ధ విమానాలను మహిళలు కూడా నడపనున్నారు. 2016 జూన్ నాటికి తొలి […]

యుద్ధ విమానాలకు ఇక మహిళా పైలెట్లు
X

ఇకపై యుద్ధ విమానాలను మహిళలు కూడా నడపనున్నారు. ఇప్పటివరకు వాయుసేనలోని రవాణ, హెలికాప్టర్ల విభాగాల్లో మాత్రమే మహిళలు సేవలందిస్తున్నారు. వారి పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో వారి సేవలను ఇక రక్షణ శాఖ, ఫైటర్ జెట్లలో కూడా వినియోగించుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత వాయు సేనలో మహిళా ఫైటర్ పైలెట్ల ప్రవేశానికి కేంద్రం ఆమోదం తెలిపినట్టు వాయుసేన వర్గాలు తెలిపాయి. దీంతో ఇకపై యుద్ధ విమానాలను మహిళలు కూడా నడపనున్నారు. 2016 జూన్ నాటికి తొలి భారతీయ మహిళా ఫైటర్ వింగ్ ఏర్పడనుంది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వారిని దీని కోసం ఎంపిక చేస్తారు. ఒక ఏడాది అడ్వాన్స్ శిక్షణ తర్వాత 2017 నుంచి మహిళా ఫైటర్ పైలెట్లు పూర్తిస్థాయిలో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటారు.

First Published:  24 Oct 2015 12:40 PM GMT
Next Story