Telugu Global
Others

బ్రహ్మాస్త్రం సిద్ధం చేస్తున్న జగన్

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం తీవ్రమవుతోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వైసీపీ కూడా స్పెషల్ స్టేటస్ సాధనే లక్ష్యంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు దీక్షలు, ధర్నాలు, ఆందోళనలతో ముందుకు సాగుతోంది. అయితే రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీ రాష్ట్రానికి హోదాపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పుడు భవిష్యత్ ఉద్యమంపై వైసీపీ వ్యూహాలకు సిద్ధమవుతోంది. అయితే ఎన్ని ధర్నాలు, ఆందోళనలు చేసినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల […]

బ్రహ్మాస్త్రం సిద్ధం చేస్తున్న జగన్
X

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమం తీవ్రమవుతోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వైసీపీ కూడా స్పెషల్ స్టేటస్ సాధనే లక్ష్యంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు దీక్షలు, ధర్నాలు, ఆందోళనలతో ముందుకు సాగుతోంది. అయితే రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీ రాష్ట్రానికి హోదాపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పుడు భవిష్యత్ ఉద్యమంపై వైసీపీ వ్యూహాలకు సిద్ధమవుతోంది.
అయితే ఎన్ని ధర్నాలు, ఆందోళనలు చేసినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి స్పందన రాకపోవడంతో తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ ప్రయోగించిన రాజీనామా ఆస్త్రాన్ని ఇప్పుడు వైసీపీ తెరపైకి తెస్తోంది.
అధిష్టానం ప్రతిపాదించే రాజీనామాల‌ అంశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు సానుకూలంగా స్పందిస్తారా? లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరారు. మరికొందరు తెలుగు తమ్ముళ్లతో టచ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకరిస్తారా? లేదా అన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.
అయితే రాజీనామాల ప్రస్తావన పార్టీలోని కొందరు నేతలనుంచే వస్తున్నా, వైఎస్‌ జగన్‌ మాత్రం ఈ విషయంపై ఎటూ నిర్ణయం తీసుకోలేక పోతున్నారట. ఇప్పటికైతే పార్టీలో రాజీనామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజైన్లతో ప్రత్యేక హోదా వస్తుందా? అని కొందరు.. ప్రత్యేక తెలంగాణ సాధ్యమైనపుడు ప్రత్యేక హోదా ఎందుకు సాధ్యం కాదని కొందరు అంటున్నారు. ఒకవేళ జగన్ రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని ప్రకటిస్తే రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

First Published:  23 Oct 2015 8:01 PM GMT
Next Story