ప్రచారం చేయబోయి కథ మొత్తం చెప్పేశారు..

బాలయ్య నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్ కు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా ట్రయిలర్ ఈమధ్యే విడుదలైంది. విడుదలైన వెంటనే మంచి రెస్పాన్స్ రాబట్టింది. ట్రయిలర్ లో బాలయ్య డైలాగ్స్ కు, వేసిన పంచ్ లకు ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. సినిమా కథ ఏమై ఉంటుందా అంటూ తెగ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఎవరెవరో పుట్టించిన గాసిప్స్ ను కూడా నమ్మి ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. కానీ డిక్టేటర్ కు సంబంధించి గాసిప్స్ నమ్మాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఆ సినిమా మేకర్సే స్వయంగా సినిమా కథ మొత్తం చెప్పేశారు. అవును.. ఆన్ లైన్ లో ప్రచారం బాగా చేయాలనే ఉత్సుకతలో సినిమాకు సంబంధించిన హైలెట్స్ పోస్ట్ చేయబోయి.. కంగారులో సినిమా కథ మొత్తాన్ని పోస్ట్ చేసేశారు మేకర్స్. సినిమా ఎలా ఓపెన్ అవుతుంది.. కథలో ట్విస్టులేంటి.. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటి.. క్లైమాక్స్ ఏం జరుగుతుందనే విషయాలన్నీ పూసగుచ్చినట్టు అందులో పోస్ట్ చేసేశారు. బాలయ్య కోసం సినిమా ప్రారంభంలో రాసిపెట్టిన 2 పేజీల క్లుప్తమైన కథను, కంగారులో పోస్ట్ చేశారు. దీంతో చాలామందికి డిక్టేటర్ కథ తెలిసిపోయింది. కొందరైతే దాన్ని షేర్ కూడా చేశారు. విషయం తెలుసుకొని తర్వాత పోస్ట్ ను డిలీట్ చేశారు మేకర్స్.