Telugu Global
Others

హోదా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు: బాలకృష్ణ

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. ప్రత్యేక హోదా అనేది తెలుగువారు తమ ఆత్మగౌరవంగా భావిస్తున్నారని, దీనిపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆయన అన్నారు. బాలకృష్ణ ఇంత సీరియస్‌గా స్పందించడం వెనుక కారణాలేమిటన్న దానిపై ఇపుడు తెలుగుదేశం నాయకులు ఆరా తీస్తున్నారు. చంద్రబాబునాయుడు మాటనే వేదంగా భావించే బాలకృష్ణ ఆయన అనుమతితోనే ఈ వ్యాఖ్యలు చేశారా అనే అంశంపై ఇపుడు చర్చ […]

హోదా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు: బాలకృష్ణ
X

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. ప్రత్యేక హోదా అనేది తెలుగువారు తమ ఆత్మగౌరవంగా భావిస్తున్నారని, దీనిపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆయన అన్నారు. బాలకృష్ణ ఇంత సీరియస్‌గా స్పందించడం వెనుక కారణాలేమిటన్న దానిపై ఇపుడు తెలుగుదేశం నాయకులు ఆరా తీస్తున్నారు. చంద్రబాబునాయుడు మాటనే వేదంగా భావించే బాలకృష్ణ ఆయన అనుమతితోనే ఈ వ్యాఖ్యలు చేశారా అనే అంశంపై ఇపుడు చర్చ జరుగుతోంది. బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రి ఆద్వర్యంలో జరిగిన ఒక కార్యమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ఈ ప్రశ్నకు ప్రత్యేక హోదాపై తీవ్రంగా స్పందించడం విశేషం ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతారని, దీంతో జనం ఎలా స్పందిస్తారో చెప్పలేమని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పకపోవచ్చని హెచ్చరించడం విశేషం. గుంటూరు ఎం.పి. గల్లా జయదేవ్ ప్రధాని మోడీ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు వియ్యంకుడు బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన సమ్మతితోనే జరిగితే ఓకే. లేకుంటే బాలకృష్ణకు కూడా సున్నితంగా క్లాస్‌ పీకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

First Published:  25 Oct 2015 8:46 AM GMT
Next Story