Telugu Global
Others

మద్యం తాగే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ఖాయం!

మద్యం తాగడం వల్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. రోజూ ఓ గ్లాస్ వైన్‌, బీర్‌ తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం నాలుగింతలు పెరుగుతుందని ఐదు యూనివర్శిటీలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పది ఐరోపా దేశాల్లో 35-70 మధ్య వయస్సు కలిగిన మూడున్నర లక్షల మంది మహిళలపై అంతర్జాతీయ బృందం పరిశోధనలు నిర్వహించింది. ఐదు స్పానిష్‌ యూనివర్సిటీలు జరిపిన ఈ పరిశోధనల్లో మద్యం తాగే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ఛాన్సెస్‌ […]

మద్యం తాగే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ఖాయం!
X

మద్యం తాగడం వల్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. రోజూ ఓ గ్లాస్ వైన్‌, బీర్‌ తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం నాలుగింతలు పెరుగుతుందని ఐదు యూనివర్శిటీలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పది ఐరోపా దేశాల్లో 35-70 మధ్య వయస్సు కలిగిన మూడున్నర లక్షల మంది మహిళలపై అంతర్జాతీయ బృందం పరిశోధనలు నిర్వహించింది. ఐదు స్పానిష్‌ యూనివర్సిటీలు జరిపిన ఈ పరిశోధనల్లో మద్యం తాగే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ ఛాన్సెస్‌ ఎక్కువగా ఉన్నాయని తేలింది. మద్యానికి, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ అధ్యయనాలు ధ్రువీకరించాయి. మద్యం తాగే మహిళలను 11 ఏళ్లు పరిశీలించిన తరువాత 11,576 మందిల్లో రొమ్ము క్యాన్సర్‌ ఉందని గుర్తించారు. రోజు 10 గ్రాముల మద్యాన్ని తాగిన మహిళల్లో ఈ ప్రమాదం నాలుగింతులు పెరిగినట్టు పరిశోధకులు తెలిపారు. మద్యం తీసుకునే పరిమాణాన్ని బట్టి క్యాన్సర్‌ ముప్పు కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

First Published:  25 Oct 2015 11:52 AM GMT
Next Story