Telugu Global
CRIME

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకూ ప్రోగ్రెస్‌ రిపోర్టు

ఏపీలో పోలీస్ అధికారుల పనితీరును అంచనా వేయడానికి కసరత్తు మొదలైంది. సిబ్బంది ఎక్కడ పని చేసినా… వారి పనితీరు, విధి నిర్వహణలో సాధించిన విజయాలు, వారిపై వచ్చిన ఫిర్యాదులతో సహా అందరి చరిత్రను లిఖితం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శాంతి భద్రతలపై జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ అధికారుల పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర […]

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకూ ప్రోగ్రెస్‌ రిపోర్టు
X

ఏపీలో పోలీస్ అధికారుల పనితీరును అంచనా వేయడానికి కసరత్తు మొదలైంది. సిబ్బంది ఎక్కడ పని చేసినా… వారి పనితీరు, విధి నిర్వహణలో సాధించిన విజయాలు, వారిపై వచ్చిన ఫిర్యాదులతో సహా అందరి చరిత్రను లిఖితం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శాంతి భద్రతలపై జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ అధికారుల పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లోని పని చేసిన పోలీస్ అధికారుల పనితీరును మదింపు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పని చేసిన చోట నేరాల నియంత్రణలో పోలీస్ అధికారుల పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వారి హయాంలో నమోదైన కేసుల సంఖ్య, నిందితులకు పడ్డ శిక్షల వివరాలను కూడా నమోదు చేసి వారి పనితీరును బేరీజు వేయాలన్నారు. ఈ కసరత్తును వచ్చే యేడాది మార్చికల్లా పూర్తి చేస్తే తదుపరి పోలీస్ శాఖలో తీసుకునే నిర్ణయాలకు ఇది ప్రాతిపదిక అవుతుందన్నారు.

First Published:  25 Oct 2015 12:06 PM GMT
Next Story