సమంత కోసం నయనతారను ఎత్తుకున్నాడు

మొన్నటివరకు పరాయి హీరోయిన్ ను కన్నెత్తిచూసేవాడు కాదు. సమంత అనుమతి లేనిదే మరో హీరోయిన్ గురించి కామెంట్ చేసేవాడు కాదు. ఎందుకంటే.. అప్పట్లో సిద్దార్థ్-సమంత మధ్య అండర్ స్టాండింగ్, రిలేషన్ షిప్  ఆ రేంజ్ లో ఉండేది. కానీ ఈమధ్య వీళ్లిద్దరూ విడిపోయారు. ఎవరి లైఫ్ వాళ్లది. దీంతో సిద్దార్థ్ కు రెక్కలొచ్చాయి. సమంత చూస్తుండగానే మిగతా హీరోయిన్లను మెచ్చుకోవడం స్టార్ట్ చేశాడు. తాజాగా తమిళనాట సమంత, నయనతార నటించిన సినిమాలు రెండూ ఒకేసారి విడుదలయ్యాయి. వీటిలో సమంత సినిమా ఫ్లాప్ అయింది. నయనతార సినిమా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. సమంత సినిమా ఫ్లాప్ అయినందుకు సిద్దార్థ్ మనసులో చాలా హ్యాపీ ఫీలయ్యాడు. కానీ అక్కడితో ఆగితే ఎవరికీ.. ఏ సమస్య ఉండేది కాదు. సిద్ధూ ఓ అడుగు ముందుకేసి నయనతారను పొగడ్డం మొదలుపెట్టాడు. సినిమాలో నయన్ చాలా బాగుందన్నాడు. యాక్టింగ్ ఇరగదీసిందని మెచ్చుకున్నాడు. సమంత గురించి ప్రస్తావించకపోయినప్పటికీ.. నయన్ ను మెచ్చుకోవడంతో అది ఎవరికి తాకాలో వాళ్లను బలంగానే తాకింది.