వచ్చే నెల నుంచి సైజ్ జీరో షురూ

సైజ్ జీరో సినిమాకు సంబంధించి విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ఈ సినిమా ప్రచారాన్ని మాత్రం వచ్చే నెల నుంచి ప్రారంభించాలని గట్టిగా ఫిక్సయ్యారు. ఎందుకంటే.. వచ్చేనెల ఒకటో తేదీన ఈ సినిమా పాటల్ని మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఆ రోజున హైదరాబాద్ నోవోటెల్ హోటల్ లో సైజ్ జీరో పాటల్ని గ్రాండ్ గా విడుదల చేస్తారు. అదే రోజు థియేట్రికల్ ట్రయిలర్ కూడా లాంచ్ చేస్తారు. కీరవాణి సంగీతం అందించిన సైజ్ జీరో సినిమాలో అనుష్క, ఆర్య జంటగా నటించారు. రుద్రమదేవి, బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుష్క.. సైజ్ జీరో సినిమా ప్రమోషన్ కోసం నవంబర్ లో మాత్రమే కాల్షీట్లు కేటాయించింది. డిసెంబర్ నుంచి ఆమె బాహుబలి-2 సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతుంది. అందుకే ఆడియో ఫంక్షన్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని భావిస్తోంది టీం. అనుష్కతో ప్రచారాన్ని ఉధృతం చేయాలని ఫిక్సయింది. ఈ సినిమాలో నాగార్జున కూడా అతిథి పాత్రలో నటించారు కాబట్టి, రాఘవేంద్రరావు రికమండేషన్ తో నాగ్ తో కూడా ప్రమోషన్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకుడు.