Telugu Global
CRIME

నారాయణ కాలేజీలో వార్డెన్ ఆత్మహత్య

నారాయణ కాలేజీలో వరుస ఆత్మహత్య పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు విద్యార్థుల చావులకే పరిమితమైన ఈ గ్రూపు కాలేజీల్లో కొత్తగా ఇపుడు ఆత్మహత్యల జాబితాలోకి వార్డెన్‌ చేరాడు. హైదర్‌గూడలోని నారాయణ క్యాంపస్లో ఆదివారం వార్డెన్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. విష్ణు అనే వ్యక్తి గత కొంతకాలంగా నారాయణ కళాశాల హాస్టల్లో వార్డెన్‌గా పని చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఈ రోజు హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా […]

నారాయణ కాలేజీలో వరుస ఆత్మహత్య పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు విద్యార్థుల చావులకే పరిమితమైన ఈ గ్రూపు కాలేజీల్లో కొత్తగా ఇపుడు ఆత్మహత్యల జాబితాలోకి వార్డెన్‌ చేరాడు. హైదర్‌గూడలోని నారాయణ క్యాంపస్లో ఆదివారం వార్డెన్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. విష్ణు అనే వ్యక్తి గత కొంతకాలంగా నారాయణ కళాశాల హాస్టల్లో వార్డెన్‌గా పని చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఈ రోజు హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఈ మరణం వెనుక మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో చూడాల్సి ఉంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  24 Oct 2015 4:02 PM GMT
Next Story