Telugu Global
NEWS

ఏపీలో వేగం మితిమీరితే కఠిన చర్యలకు సీఎం ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో వాహనాల వేగానికి కళ్ళెం వేస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వీటి నివారణకు కఠిన చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇక నుంచి 80 కిలోమీటర్లు మించి వేగంగా వెళ్ళే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. జాతీయ రహదారులపై వాహనాల వేగానికి కళ్ళెం వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ఆదేశంతో రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. వేగం 80 […]

ఏపీలో వేగం మితిమీరితే కఠిన చర్యలకు సీఎం ఆదేశం
X

ఆంధ్రప్రదేశ్‌లో వాహనాల వేగానికి కళ్ళెం వేస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వీటి నివారణకు కఠిన చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇక నుంచి 80 కిలోమీటర్లు మించి వేగంగా వెళ్ళే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. జాతీయ రహదారులపై వాహనాల వేగానికి కళ్ళెం వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ఆదేశంతో రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. వేగం 80 కిలోమీటర్లు దాటితే వాహన చోదకులపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో మద్యం తాగి వాహనాలు నడపడాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని చంద్రబాబు ఆదేశించడంతో రవాణాశాఖాధికారులు వేగాన్ని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి తన నివాసం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో రాష్ట్ర రవాణా, పోలీసు శాఖలతోపాటు జాతీయ రహదారి అథారిటీ అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు మితిమీరడం, మరణాల సంఖ్య పెరగడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. టోల్‌ గేట్‌కు, టోల్‌ గేట్‌కు మధ్య ఉన్న దూరం ప్రాతిపదికగా తీసుకుని వేగాన్ని అంచనా వేయాలని, మితిమీరిన వేగంగా వాహనాలు నడుపుతున్నట్టు భావిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడవద్దని ఆయన ఆదేశించారు. దూరాన్ని, ప్రయాణించే వాహన వేగాన్ని అంచనా వేసి చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులకు ఆయన సూచించారు. చర్యలు తీసుకోవడానికి ముందుగా కొంత ప్రచారం చేయాలని, వేగ నియంత్రణ కోసం హెచ్చరికలు చేస్తూ నెల రోజుల లోపు హైవేలపై బోర్డులు పెట్టాలని ఆదేశించారు.

First Published:  26 Oct 2015 12:13 PM GMT
Next Story