Telugu Global
Others

వాళ్ళుచేస్తే తప్పు... వీళ్ళు చేస్తే రైటు

మనవాడు గొప్పోడు అని చెప్పుకోవడానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి మా వాడు గొప్పోడు అంటూ డబ్బా కొట్టడం. లేదా పక్కోడు పనికిమాలిన వాడు అని ప్రచారం చేయడం. రాష్ట్రంలో టీడీపీ అనుకూల మీడియా మాత్రం చంద్రబాబును కాపాడేందుకు ఈ రెండు ఫార్ములాలను కలిపి పోరాటం చేస్తోందని బిజేపి నేతలంటున్నారు. తాజాగా వచ్చిన ఒక కథనంలో కొన్ని వ్యాఖ్య‌లు గమనిస్తే … చంద్రబాబును చూసి మోదీ అసూయపడుతున్నారట. చంద్రబాబు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు నడపడం మోదీకి రుచించడం […]

వాళ్ళుచేస్తే తప్పు... వీళ్ళు చేస్తే రైటు
X

మనవాడు గొప్పోడు అని చెప్పుకోవడానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి మా వాడు గొప్పోడు అంటూ డబ్బా కొట్టడం. లేదా పక్కోడు పనికిమాలిన వాడు అని ప్రచారం చేయడం. రాష్ట్రంలో టీడీపీ అనుకూల మీడియా మాత్రం చంద్రబాబును కాపాడేందుకు ఈ రెండు ఫార్ములాలను కలిపి పోరాటం చేస్తోందని బిజేపి నేతలంటున్నారు. తాజాగా వచ్చిన ఒక కథనంలో కొన్ని వ్యాఖ్య‌లు గమనిస్తే … చంద్రబాబును చూసి మోదీ అసూయపడుతున్నారట. చంద్రబాబు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు నడపడం మోదీకి రుచించడం లేదని రాశారు. నిజంగానే మోదీ అసూయపడుతుంటే చంద్రబాబు ఇలా నెలకోసారి విమానమేసుకుని విదేశాలకు వెళ్లగలరా?. దేశ ప్రధానే విముఖంగా ఉన్నారని తెలిస్తే సింగపూర్, జపాన్ బృందాలు అమరావతి భూములపై కవాతుకు ధైర్యం చేసేవా అని బిజేపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇంకో కామెంట్… ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నా కేంద్రంతో పెట్టుకుంటే మిగిలేది బూడిదేనన్న విషయం చంద్రబాబుకు తెలుసని అందుకే మోదీ దగ్గర వినయంగా ఉన్నారని సమర్థించారు. అంటే రాష్ట్ర ప్రజల కోసమే తన ఇగోను కూడా త్యాగం చేస్తున్నారని పరోక్షంగా చెప్పడం ద్వారా చంద్రబాబుని ఓ త్యాగశీలిగా మార్చే ప్రయత్నం చేశారు. మరి గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు గానీ, కేంద్ర మంత్రులుగానీ సోనియా దగ్గర వినయంగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు ఏమని ప్రచారం చేశారో గుర్తుందా?.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారంటూ గగ్గోలు పెట్టలేదా?. మరి ఇప్పుడు మోదీ దగ్గర చంద్రబాబు ఒంగిఒంగి దండాలు పెడితే మాత్రం తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతినలేదా అని విపక్షాలు అంటున్నాయి. ఈ మధ్య అసలు తెలుగు వారి ఆత్మగౌరవం లాంటి ఘనమైన పదాలను చంద్రబాబు వాడడం లేదు. అంటే బాబు చేస్తే శృంగారం, కాంగ్రెస్ వాళ్లు చేస్తే మాత్రం వ్యభిచారమన్న మాట. నిజమే సొంత డబ్బాలు లేని వాళ్లు ఏది చేసినా వ్యభిచారమే అంటున్నారు.

పనిలో పనిగా తమ చిరకాల ప్రత్యర్థి జగన్‌ను కూడా వదిలిపెట్టలేదు. రాజధాని శంకుస్థాపనను జగన్ బహిష్కరించడం పై రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. మరి స్పీకర్‌గా కిరణ్‌కుమార్ రెడ్డిని నియమించినప్పుడు చంద్రబాబు ఏం చేశారో గుర్తు లేదా?. ఎన్నికైన తొలిరోజు స్పీకర్‌ను తన కుర్చీవరకు ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత తీసుకెళ్లి కూర్చోబెట్టడం ఆనవాయితీ . మరి ఆరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేదు. దాన్నేమనాలి?. ఆ రోజు చంద్రబాబులో సంకుచితం కాకుండా విశాఖ తీరమంతా విశాలమైన మనసు కనిపించిందా అని ప్రశ్నిస్తున్నారు.

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సచివాలయంలో అడుగుపెట్టనని ప్రకటించి చంద్రబాబు పంతం పట్టినప్పుడు అది సంకుచిత స్వభావంలా అనిపించలేదా?. అసలు మన మట్టి మన నీరు అంటూ జనాన్ని మూఢనమ్మకాల వైపు ఒక ముఖ్యమంత్రే మళ్లిస్తుంటే విమర్శించాల్సింది పోయి రాజధాని సెంటిమెంట్ వ్యాపింపచేయడంలో చంద్రబాబు విజయవంతమయ్యాడని సర్టిఫికేట్ ఇవ్వడం నిజంగానే అద్భుత చర్యే!

చంద్రబాబు ఎప్పటికైనా తనకు జాతీయ స్థాయిలో పోటీ వస్తారేమోనన్న భావన మోదీలో ఉందని కూడా పరోక్షంగా ప్రచారంచేస్తున్నారు. మోదీ మనసులో నిజంగా అదే ఉంటే ఆడియో వీడియో టేపులతో సహా ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు నేడు ముఖ్యమంత్రి పదవిలో ఉండేవారా?. రాజధాని పేరుతో వేల ఎకరాల్లో పచ్చటి పంటలను ధ్వంసం చేసి రియల్ దందాకు దిగేవారా?. బహుషా లోకల్‌లో బాబు చేస్తున్న ప్రచారం గురించి తెలిస్తే మాత్రం అసలు అమరావతి శంకుస్థాపనకు వెళ్లడమే తన తప్పని మోదీ ఫీలవడం ఖాయం అని బిజేపి నేతలంటున్నారు.

First Published:  26 Oct 2015 1:29 AM GMT
Next Story