Telugu Global
Cinema & Entertainment

చిత్రపురి ఎన్నికల్లో అదే చిత్రం

టాలీవుడ్ చిత్రపరిశ్రమకు వెన్నెముక లాంటి చిత్రపురి కాలనీ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా జరిగాయి. బంజారాహిల్స్ లోని చిత్రపురి కాలనీ వాసులు ఈసారి కూడా పాత ప్యానల్ కే పట్టం కట్టారు. ప్రస్తుత ప్రెసిడెంట్ కొముర వెంకటేష్ ప్యానల్ కు, గాయకుడు, రచయిత వందేమాతరం శ్రీనివాస్ ప్యానల్‌కు మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా భావించారు. అయితే మొత్తం 11 మంది సభ్యుల ప్యానల్ కు జరిగిన ఎన్నికల్లో 11మంది సభ్యులు కొముర వెంకటేష్ ప్యానల్ నుంచే విజయం […]

టాలీవుడ్ చిత్రపరిశ్రమకు వెన్నెముక లాంటి చిత్రపురి కాలనీ ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా జరిగాయి. బంజారాహిల్స్ లోని చిత్రపురి కాలనీ వాసులు ఈసారి కూడా పాత ప్యానల్ కే పట్టం కట్టారు. ప్రస్తుత ప్రెసిడెంట్ కొముర వెంకటేష్ ప్యానల్ కు, గాయకుడు, రచయిత వందేమాతరం శ్రీనివాస్ ప్యానల్‌కు మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా భావించారు. అయితే మొత్తం 11 మంది సభ్యుల ప్యానల్ కు జరిగిన ఎన్నికల్లో 11మంది సభ్యులు కొముర వెంకటేష్ ప్యానల్ నుంచే విజయం సాధించారు. వందేమాతరం శ్రీనివాస్ ప్యానెల్ నుంచి ఒక్క సభ్యుడు కూడా గెలవలేదు.
రాత్రి వరకు సాగిన కౌంటింగ్ లో తెలుగు సినీ వర్కర్స్ కో – ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కొముర టీమ్ విజయం సాధించిందని ప్రకటించగానే ఆయన మద్దతుదారులు ఆనందంలో మునిగిపోయారు.
చిత్రసీమలో పనిచేసే వారందరికీ సొంతింటి కల నెరవేర్చడమే తన లక్ష్యమని కొముర వెంకటేశ్ హామీ ఇచ్చారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు వెన్నెముక లాంటి చిత్రపురి కాలనీకి 1993లో స్థల కేటాయింపు జరిగింది. అయితే 2008 నుంచి 2015 వరకు కాలనీ నిర్మాణ పనులు జరిగాయి. మొత్తం 4300 ఫ్లాట్స్ కు గాను 2700 ఫ్లాట్స్ నిర్మించారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో జాప్యం నిజమేనని ఇకపై పనులు వేగవంతం చేస్తామని కొత్త అధ్యక్షుడు కొముర వెంకటేశ్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాదికల్లా మిగతా బిల్డింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.

First Published:  25 Oct 2015 11:07 PM GMT
Next Story