Telugu Global
NEWS

మాట వినకపోతే భూములు లాక్కుంటాం: చంద్రబాబు

భూముల స్వాధీనానికి అవసరమైతే ప్యాకేజీ పెంచుతామని, ఒకవేళ అప్పటికీ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతంగా లాక్కోడానికి కూడా వెనుకాడమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఉండవల్లి, పెనుమాక రైతులకు ప్యాకేజీ పెంచాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో భూములు తీసుకోవద్దని, రైతులు తమంతట తాము ఇస్తేనే స్వాధీనం చేసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన విజ్ఞప్తికి విరుద్ధంగా చంద్రబాబు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులతో సీఎం చంద్రబాబు […]

మాట వినకపోతే భూములు లాక్కుంటాం: చంద్రబాబు
X

భూముల స్వాధీనానికి అవసరమైతే ప్యాకేజీ పెంచుతామని, ఒకవేళ అప్పటికీ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే బలవంతంగా లాక్కోడానికి కూడా వెనుకాడమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఉండవల్లి, పెనుమాక రైతులకు ప్యాకేజీ పెంచాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో భూములు తీసుకోవద్దని, రైతులు తమంతట తాము ఇస్తేనే స్వాధీనం చేసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన విజ్ఞప్తికి విరుద్ధంగా చంద్రబాబు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులతో సీఎం చంద్రబాబు సోమవారం సమావేశమయ్యారు. 2100 ఎకరాల లంక భూములు కొనుగోలు చేస్తున్న మాఫియాపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో రైతులను కొందరు మోసం చేస్తున్నారని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం లంక భూములు ఎంత పెద్ద వారు కొన్నా వదలొద్దన్నారు. నాలుగు రోజుల్లో అసైన్డ్‌ భూముల సమస్యను పరిష్కరిస్తామని రైతులకు బాబు హామీ ఇచ్చారు. భూములకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. భూములివ్వని రైతులతో మరోసారి మాట్లాడి వారికి నచ్చజెప్పాలని ఆయన అధికారులకు సూచించారు.

First Published:  26 Oct 2015 7:56 AM GMT
Next Story