Telugu Global
Cinema & Entertainment

అక్కినేని  హీరోల చిత్రాల వెన‌క ఏం జ‌రుగుతుంది..!

సినిమాలు పోస్ట్ పోన్ కావ‌డం  సాధ‌ర‌ణ విష‌య‌మే . కానీ ఒకే  ఫ్యామిలీ కి  చెందిన ముగ్గురు హీరోల చిత్రాలు పోస్ట్ పోన్ ప‌డ‌టం అనేది   ఆలోచ‌న చేయాల్సిన  విష‌య‌మే . ముందుగా  అఖిల్ చిత్రం  ద‌స‌ర పండ‌గ‌కు రిలీజ్ కావాల్సి  వుంది. కానీ.. కొన్ని గ్రాఫిక్స్  క్వాలిటిగా రాక పోవ‌డం వ‌ల‌న  సినిమా రిలీజ్ ను వాయిదా వ‌స్తున్న‌ట్లు  ప్రెస్ మీట్  పెట్టి నాగార్జున‌, ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్, నిర్మాత  తెలిపారు.కేవలం కొన్ని రోజుల్లోనే పని […]

అక్కినేని  హీరోల చిత్రాల వెన‌క ఏం జ‌రుగుతుంది..!
X

సినిమాలు పోస్ట్ పోన్ కావ‌డం సాధ‌ర‌ణ విష‌య‌మే . కానీ ఒకే ఫ్యామిలీ కి చెందిన ముగ్గురు హీరోల చిత్రాలు పోస్ట్ పోన్ ప‌డ‌టం అనేది ఆలోచ‌న చేయాల్సిన విష‌య‌మే . ముందుగా అఖిల్ చిత్రం ద‌స‌ర పండ‌గ‌కు రిలీజ్ కావాల్సి వుంది. కానీ.. కొన్ని గ్రాఫిక్స్ క్వాలిటిగా రాక పోవ‌డం వ‌ల‌న సినిమా రిలీజ్ ను వాయిదా వ‌స్తున్న‌ట్లు ప్రెస్ మీట్ పెట్టి నాగార్జున‌, ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్, నిర్మాత తెలిపారు.కేవలం కొన్ని రోజుల్లోనే పని పూర్తయిపోతుందని.. ఆ వెంటనే డేట్ అనౌన్స్ చేస్తామని అన్నాడు మన్మథుడు. కానీ ఇప్పటికే తొమ్మిది రోజులవుతోంది. ‘అఖిల్’ గురించి ఏ కబురూ లేదు. దసరా పోయినా దీపావళికి గ్యారెంటీ అని అనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. కొందరేమో ఈ సినిమా సంక్రాంతికి అంటూ ఓ ప్రచారం మొదలుపెట్టేశారు.
‘అఖిల్’ సంగతలా ఉంచితే నాగ్ సినిమాలు సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. కానీ రిలీజ్ డేట్ విషయంలో కంగాళీ నడుస్తోంది. సోగ్గాడే.. డిసెంబరు దాకా ఎందుకు వాయిదా పడిందో అర్థం కావడం లేదు. అప్పుడైనా వస్తుందో లేదో మరి. మరోవైపు ‘ఊపిరి’ని వచ్చే ఏడాదికి వాయిదా వేసేయడం కూడా సందేహాలకు తావిస్తోంది. మరోవైపు నాగచైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ను కూడా దీపావళికి విడుదల అన్నారు. ఇప్పుడు డిసెంబరు అంటున్నారు. ఐతే ఈ సినిమాల వాయిదాకు వేర్వేరు కారణాలు ఉండి ఉండొచ్చు కానీ.. అందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్లు కావడంతోనే సమస్య వచ్చి పడింది. అస‌లేం జ‌రుగుతుందో వాళ్ల‌కే తెలియాల మ‌రి.

First Published:  25 Oct 2015 7:05 PM GMT
Next Story