Telugu Global
International

ఈ బిస్కెట్ 15లక్షలు

ఓల్డ్ ఈజ్ ఆల్ వేస్ గోల్డ్ అన్న సామెత ఇప్పుడు అక్షరాలా నిజం చేశారు బ్రిటన్‌లో హెన్రీ అడ్రిడ్జ్ అండ్ సన్ సంస్థ నిర్వాహకులు. ఓ బిస్కెట్ ను ఏకంగా 15లక్షలకు అమ్మేశారు. పోనీ అది బంగారు బిస్కెట్ కూడా కాదు. మరి 15లక్షల రూపాయల ధర ఎందుకు పలికిందన్నదే ఇక్కడ చర్చనీయాంశం. అవును ఆ బిస్కెట్ కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఓ చేదు జ్ఞాపకానికి గుర్తుగా అది ఇప్పటికీ నిలిచివుంది. 1912లో టైటానిక్ […]

ఈ బిస్కెట్ 15లక్షలు
X

ఓల్డ్ ఈజ్ ఆల్ వేస్ గోల్డ్ అన్న సామెత ఇప్పుడు అక్షరాలా నిజం చేశారు బ్రిటన్‌లో హెన్రీ అడ్రిడ్జ్ అండ్ సన్ సంస్థ నిర్వాహకులు. ఓ బిస్కెట్ ను ఏకంగా 15లక్షలకు అమ్మేశారు. పోనీ అది బంగారు బిస్కెట్ కూడా కాదు. మరి 15లక్షల రూపాయల ధర ఎందుకు పలికిందన్నదే ఇక్కడ చర్చనీయాంశం. అవును ఆ బిస్కెట్ కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఓ చేదు జ్ఞాపకానికి గుర్తుగా అది ఇప్పటికీ నిలిచివుంది.
1912లో టైటానిక్ ఓడ మునక సందర్భంగా ప్రయాణికులను రక్షించడానికి ఉపయోగించిన కార్పాథియా అనే లైఫ్‌బోట్‌లోని పైలట్‌కు లభ్యమైంది. నార్త్‌ అట్లాంటిక్‌ మహాసముద్రంలో టైటానిక్‌ నౌక నుంచి లభ్యమైన ఈ బిస్కెట్‌ ను బ్రిటన్‌లో హెన్రీ అడ్రిడ్జ్ అండ్ సన్ సంస్థ నిర్వాహకులు అమ్మకానికి పెట్టారు.
టైటానిక్‌ షిప్ కు సంబంధించిన ప్రతి విషయం ఓ జ్ఞాపకమే. అందుకే ప్రపంచం దాన్ని ఇంకా మర్చిపోలేదు కాబట్టే అందులో దొరికిన బిస్కెట్‌ వేలంలో పదిహేను వేల పౌండ్ల ధర పలికింది. గ్రీస్‌లోని పురాతన వస్తువులు సేకరించే ఓ వ్యక్తి ఈ బిస్కెట్‌ను సొంతం చేసుకున్నాడని బీబీసీ ప్రకటించింది.

First Published:  26 Oct 2015 11:04 PM GMT
Next Story