Telugu Global
National

ఇండోర్‌లో గీతకు తాత్కాలిక ఆశ్రయం

కొందరు దిక్కులేని అనాథలు… మరికొందరు తల్లిదండ్రులు ఎవరో తెలియని అమాయకులు… ఇంకొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆశ్రయం పొందుతున్నవారు… ఇలా అందరూ ఒకేచోట కలిసిన వేదికే ఇండోర్‌లోని డఫ్‌, బైలింగ్వల్‌ అకాడమీ. ప్రస్తుతం పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చిన గీత ఆశ్రయం పొందుతున్న స్థలి. పదిహేనేళ్ళ తర్వాత భారత్‌ చేరుకున్న గీతకు ఇంతవరకు తన తల్లిదండ్రులెవరో స్పష్టత రాలేదు. బీహార్‌లో ఉంటున్న ఓ జంట గీత తమ కూతురేనని చెబుతున్నారు. అయితే ఆమెకు పెళ్ళయ్యిందని, ఆమెకో కూతురు […]

ఇండోర్‌లో గీతకు తాత్కాలిక ఆశ్రయం
X

కొందరు దిక్కులేని అనాథలు… మరికొందరు తల్లిదండ్రులు ఎవరో తెలియని అమాయకులు… ఇంకొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆశ్రయం పొందుతున్నవారు… ఇలా అందరూ ఒకేచోట కలిసిన వేదికే ఇండోర్‌లోని డఫ్‌, బైలింగ్వల్‌ అకాడమీ. ప్రస్తుతం పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చిన గీత ఆశ్రయం పొందుతున్న స్థలి. పదిహేనేళ్ళ తర్వాత భారత్‌ చేరుకున్న గీతకు ఇంతవరకు తన తల్లిదండ్రులెవరో స్పష్టత రాలేదు. బీహార్‌లో ఉంటున్న ఓ జంట గీత తమ కూతురేనని చెబుతున్నారు. అయితే ఆమెకు పెళ్ళయ్యిందని, ఆమెకో కూతురు కూడా ఉందని చెబుతున్నారు. అయితే తనకు పెళ్ళవలేదని, కూతురు ఉండనడం కూడా అబద్దమని గీత చెబుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎవరో తెలియడానికి ఆమెకు డిఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆమె డిఎన్‌ఏ మ్యాచ్‌ అయ్యేవరకు గీతను వేరే చోట ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆమె తల్లిదండ్రులు తేలేవరకు గీత ఇండోర్‌లో ఉంటుందని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. ఇండోర్‌లోని డఫ్‌ బైలింగ్వల్‌ అకాడమీలో గీత ఆశ్రయం పొందుతుందని ప్రకటించారు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ అకాడమీపై పడింది. ఆ పాఠశాలలో సుమారు వంద మంది పిల్లలు ఉన్నారు. వారందరూ గీత లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నవారే.

First Published:  27 Oct 2015 3:57 AM GMT
Next Story