Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ నుంచే శ్రీదేవి కూతురు ఎంట్రీ

హీరోయిన్ గా ఎదగాలనుకుంటే ముందు టాలీవుడ్ లో పాఠాలు నేర్చుకోవాలి. తర్వాత కోలీవుడ్ లో మంచి పాత్రలు చేయాలి. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి ఫిక్స్ అయిపోవాలి. ఇది ఫిక్స్ డ్ ఫార్ములా. ఇప్పుడీ ఫార్ములాను శ్రీదేవి తన కూతురుకు అప్లై చేయాలనుకుంటోంది. అవును.. శ్రీదేవి కూతురు జాహ్నవి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. కానీ ప్రతిసారి ఆమె ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తోంది. తాజాగా తమిళనాట దుల్కర్ సుమన్ సరసన […]

టాలీవుడ్ నుంచే శ్రీదేవి కూతురు ఎంట్రీ
X
హీరోయిన్ గా ఎదగాలనుకుంటే ముందు టాలీవుడ్ లో పాఠాలు నేర్చుకోవాలి. తర్వాత కోలీవుడ్ లో మంచి పాత్రలు చేయాలి. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి ఫిక్స్ అయిపోవాలి. ఇది ఫిక్స్ డ్ ఫార్ములా. ఇప్పుడీ ఫార్ములాను శ్రీదేవి తన కూతురుకు అప్లై చేయాలనుకుంటోంది. అవును.. శ్రీదేవి కూతురు జాహ్నవి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. కానీ ప్రతిసారి ఆమె ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తోంది. తాజాగా తమిళనాట దుల్కర్ సుమన్ సరసన శ్రీదేవి కూతురు హీరోయిన్ గా నటించనుందనే టాక్ కూడా వచ్చింది. కానీ అది కూడా ఉత్తుత్తి ప్రచారమే అని తేలిపోయింది. ఇప్పుడు జాహ్నవిపై మరో పుకారు షికారు చేస్తోంది. ఆమె ఎంట్రీ టాలీవుడ్ నుంచే ఉంటుందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, శ్రీదేవితో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. శ్రీదేవి కూడా తన కూతురు టాలీవుడ్ నుంచే ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావిస్తుందట. అయితే జాహ్నవి, ఏ హీరో సరసన మెరవనుందనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు శ్రీదేవి కూతురు మాత్రం యాక్టింగ్, డాన్స్ లాంటి విభాగాల్లో ట్రయినింగ్ తీసుకుంటూ బిజీగా ఉంటోంది.
First Published:  26 Oct 2015 7:07 PM GMT
Next Story