Telugu Global
Cinema & Entertainment

యూనిట్ మొత్తానికి షాకిచ్చిన ఎన్టీఆర్

సినిమాల విషయంలో ఎన్టీఆర్ ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటాడనే అంశానికి సంబంధించిన వార్త ఇది. నాన్నకు ప్రేమంతో సినిమా కోసం ఇప్పటికే బల్క్ లో కాల్షీట్లు కేటాయించాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం ఏకంగా కుటుంబానికి దూరంగా లండన్ లో 2 నెలల పాటు ఉండిపోయాడు. ప్రతి రోజు సినిమా కోసమే ఆలోచించాడు. భారీ షెడ్యూల్ తర్వాత ఇండియా తిరిగొచ్చి దసరా వేడుకల్లో పాల్గొన్నాడు. వచ్చేనెల 1 నుంచి స్పెయిన్ లో మరో షెడ్యూల్ కు […]

యూనిట్ మొత్తానికి షాకిచ్చిన ఎన్టీఆర్
X
సినిమాల విషయంలో ఎన్టీఆర్ ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటాడనే అంశానికి సంబంధించిన వార్త ఇది. నాన్నకు ప్రేమంతో సినిమా కోసం ఇప్పటికే బల్క్ లో కాల్షీట్లు కేటాయించాడు ఎన్టీఆర్. ఈ సినిమా కోసం ఏకంగా కుటుంబానికి దూరంగా లండన్ లో 2 నెలల పాటు ఉండిపోయాడు. ప్రతి రోజు సినిమా కోసమే ఆలోచించాడు. భారీ షెడ్యూల్ తర్వాత ఇండియా తిరిగొచ్చి దసరా వేడుకల్లో పాల్గొన్నాడు. వచ్చేనెల 1 నుంచి స్పెయిన్ లో మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఈ షార్ట్ గ్యాప్ లోనే ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ షురూ చేశాడు ఎన్టీఆర్. ఉన్న ఈ 4 రోజుల్లోనే హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. దీనికి కారణం రకుల్ ప్రీత్ సింగ్. హీరోయిన్ గా ఆమె ఇప్పుడు చాలా బిజీగా ఉంది. అందుకే ఆమె కోసం ఎన్టీఆర్, తన విరామ సమయాన్ని కూడా ఫణంగా పెట్టాడు. సడెన్ గా హైదరాబాద్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఈ షూటింగ్ అయిన వెంటనే నాన్నకు ప్రేమతో టీం స్పెయిన్ వెళ్తుంది. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు.
First Published:  26 Oct 2015 7:03 PM GMT
Next Story