Telugu Global
CRIME

నిత్య పెళ్లి కొడుక్కి దేహశుద్ధి

మరికొద్దిసేపట్లో పెళ్లి… పచ్చ తోరణాలు…పెళ్ళి పందిళ్లు… బంధువుల హడావిడి ఏమీ లేదు… వధువు తరఫు బంధువులంతా రాజమండ్రి నుంచి హడావుడిగా ఓ బస్సులో వచ్చేశారు. పెళ్ళికొడుకు ఇంటి దగ్గర చూస్తే వరుడు ఒక్కడే తాపీగా కూర్చున్నాడు. దీంతో అనుమానం వచ్చిన పెళ్ళికూతురు తరఫువారు ‘అదేంటి..! పెళ్లింట బంధువులు ఎవరూ లేరు?’ అని పెళ్లి కొడుకుని ప్రశ్నించారు? పెళ్లికి నేనుంటే చాలదా? రెండు దండలు… పసుపుతాడు సరిపోవా? అంటూ ఎదురు ప్రశ్నించేసరికి పెళ్లి కూతురు వైపు బంధువులు ఆశ్చర్యపోయారు. […]

మరికొద్దిసేపట్లో పెళ్లి… పచ్చ తోరణాలు…పెళ్ళి పందిళ్లు… బంధువుల హడావిడి ఏమీ లేదు… వధువు తరఫు బంధువులంతా రాజమండ్రి నుంచి హడావుడిగా ఓ బస్సులో వచ్చేశారు. పెళ్ళికొడుకు ఇంటి దగ్గర చూస్తే వరుడు ఒక్కడే తాపీగా కూర్చున్నాడు. దీంతో అనుమానం వచ్చిన పెళ్ళికూతురు తరఫువారు ‘అదేంటి..! పెళ్లింట బంధువులు ఎవరూ లేరు?’ అని పెళ్లి కొడుకుని ప్రశ్నించారు? పెళ్లికి నేనుంటే చాలదా? రెండు దండలు… పసుపుతాడు సరిపోవా? అంటూ ఎదురు ప్రశ్నించేసరికి పెళ్లి కూతురు వైపు బంధువులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేరుకుని అనుమానం వచ్చి ఆరా తీస్తే.. నమ్మి రవి పెయింటర్ పెళ్ళికొడుక్కి అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయని.. తెలుసుకుని అతనికి దేహశుద్ధి చేశారు. పెళ్ళి సంబంధం తీసుకువచ్చిన మధ్యవర్తికి నానా చివాట్లూ పెట్టారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో చోటు చేసుకుంది.

First Published:  26 Oct 2015 4:03 PM GMT
Next Story