Telugu Global
CRIME

అనూహ్య కేసు... ట్యాక్సీ డ్రైవరే కిరాతకుడు

కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్‌ అనూహ్య అత్యాచారం, హత్య కేసులో ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. ట్యాక్సీ డ్రైవర్  చంద్రభాన్‌ను దోషిగా తేల్చింది. బుధవారం శిక్ష ఖరారు కానుంది. నేరం తీవ్రత దృష్ణ్యా చంద్రభాన్‌కు ఉరి శిక్ష లేదా యావజ్జీవ ఖైదు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎస్తర్ అనూహ్య ముంబైలోని టీసీఎస్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేసిది. సెలవుపై సొంతూరు వచ్చిన అనుహ్య గతేడాది జనవరి మొదటి వారంలో ముంబై […]

అనూహ్య కేసు... ట్యాక్సీ డ్రైవరే కిరాతకుడు
X

కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్‌ అనూహ్య అత్యాచారం, హత్య కేసులో ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. ట్యాక్సీ డ్రైవర్ చంద్రభాన్‌ను దోషిగా తేల్చింది. బుధవారం శిక్ష ఖరారు కానుంది. నేరం తీవ్రత దృష్ణ్యా చంద్రభాన్‌కు ఉరి శిక్ష లేదా యావజ్జీవ ఖైదు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

ఎస్తర్ అనూహ్య ముంబైలోని టీసీఎస్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేసిది. సెలవుపై సొంతూరు వచ్చిన అనుహ్య గతేడాది జనవరి మొదటి వారంలో ముంబై తిరుగు ప్రయాణమైంది. ఆ క్రమంలో ముంబైలో దిగిన అనుహ్య ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చంద్రభాన్‌ వెంట అనుహ్య వెళ్లినట్టు గుర్తించారు.ట్యాక్సీ డ్రైవర్ అయిన చంద్రభాన్‌ ట్యాక్సీ మరోచోట ఉందని చెప్పి అనుహ్యను బైక్‌లో తీసుకెళ్లాడు. అలా నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. ముంబైలోని కంజూర్‌మార్గ్ ప్రాంతంలో కాలిపోయి ఉన్న అనుహ్య మృతదేహన్ని పోలీసులు గుర్తించారు.

First Published:  27 Oct 2015 2:42 AM GMT
Next Story