Telugu Global
Others

పోటీకైనా సిద్ధం... మద్దతైనా ఇద్దాం: టీటీడీపీ

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీకైనా సిద్ధంగా ఉండాలని లేదా భారతీయ జనతాపార్టీ తమకే ఆ స్థానం కావాలని కోరితే మద్దతివ్వడానికైనా సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధినేత ఎన్‌. చంద్రబాబునాయుడు సూచించారు. ఈ నియోజకవర్గం ఉప ఎన్నికపై సమీక్షించడానికి తెలంగాణ తెలుగుదేశం నాయకులంతా చంద్రబాబుతో సుదీర్ఘంగా ఐదు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో మిత్ర ధర్మం పాటిద్దామని, పోటీ చేయడానికైనా, బీజేపీకి మద్దతివ్వడానికైనా సిద్ధంగా ఉందామని ఆయన ఇచ్చిన పిలుపుకు నాయకులంతా […]

పోటీకైనా సిద్ధం... మద్దతైనా ఇద్దాం: టీటీడీపీ
X

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీకైనా సిద్ధంగా ఉండాలని లేదా భారతీయ జనతాపార్టీ తమకే ఆ స్థానం కావాలని కోరితే మద్దతివ్వడానికైనా సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధినేత ఎన్‌. చంద్రబాబునాయుడు సూచించారు. ఈ నియోజకవర్గం ఉప ఎన్నికపై సమీక్షించడానికి తెలంగాణ తెలుగుదేశం నాయకులంతా చంద్రబాబుతో సుదీర్ఘంగా ఐదు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో మిత్ర ధర్మం పాటిద్దామని, పోటీ చేయడానికైనా, బీజేపీకి మద్దతివ్వడానికైనా సిద్ధంగా ఉందామని ఆయన ఇచ్చిన పిలుపుకు నాయకులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. తెలుగుదేశం పోటీ చేయాల్సి వస్తే అభ్యర్థిగా సాంబయ్యను బరిలో నిలుపుదామని ఆయన సూచించారు. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిని 2014 ఎన్నికల్లో గెలిచామని, ఇపుడు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, అలాగే పార్టీ పట్ల అనుకూలత ఏర్పడిందని నాయకులు చెబుతూ తెలుగుదేశం పోటీ చేస్తే గెలవడం ఖాయమని అన్నారు. అయితే మిత్రధర్మం పాటించి అభ్యర్థి విషయంలో నిర్ణయం ఎలా ఉన్నా అందరూ ఉమ్మడిగా పని చేయాలని పిలుపు ఇచ్చారు. ఈసందర్భంగా నాయకులంతా తమలో ఎలాంటి విభేదాలు లేవని, కలిసికట్టుగా పని చేస్తామని, అవసరమైతే మద్దతిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమకు కేంద్రంలో నామినేటెడ్‌ పదవులు ఇప్పించాలని చంద్రబాబును కోరగా… ఇప్పటికే ఈ అంశంపై రెండు, మూడుసార్లు కేంద్రాన్ని అడిగానని, మరోసారి ప్రయత్నిస్తానని ఆయన బదులిచ్చారు.

First Published:  27 Oct 2015 11:54 AM GMT
Next Story