Telugu Global
Cinema & Entertainment

త్రిపుర వ‌చ్చేస్తుంది

 సినిమా  ఒక బిజినెస్.  వ్యాపారం చేయ‌డం తెలిస్తే..ప్ర‌స్తుతం  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్  మంచి సోర్స్ ఆఫ్ ఇన్ క‌మ్. ఈ విష‌యం  స్టార్ రైట‌ర్ కోన వెంకట్‌ త్వ‌ర‌గా క్యాచ్ చేసేశాడు. ఆ మ‌ధ్య  హీరోయిన్ అంజ‌లి తో  అన్ని తానై చేసిన గీతాంజ‌లి చిత్రం   మంచి లాభాలు తెచ్చింది. దీంతో తాజాగా   క‌ల‌ర్స్ స్వాతి తో   త్రిపుర పేరు తో మ‌రో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేస్తున్నారు.  పేరు కి ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ […]

త్రిపుర వ‌చ్చేస్తుంది
X
సినిమా ఒక బిజినెస్. వ్యాపారం చేయ‌డం తెలిస్తే..ప్ర‌స్తుతం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ మంచి సోర్స్ ఆఫ్ ఇన్ క‌మ్. ఈ విష‌యం స్టార్ రైట‌ర్ కోన వెంకట్‌ త్వ‌ర‌గా క్యాచ్ చేసేశాడు. ఆ మ‌ధ్య హీరోయిన్ అంజ‌లి తో అన్ని తానై చేసిన గీతాంజ‌లి చిత్రం మంచి లాభాలు తెచ్చింది. దీంతో తాజాగా క‌ల‌ర్స్ స్వాతి తో త్రిపుర పేరు తో మ‌రో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేస్తున్నారు. పేరు కి ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ అయిన‌ప్ప‌టికి..దీని వెన‌క అంతా కోన వెంక‌టే చేస్తున్నార‌నేది ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. త్రిపుర సినిమా రిలీజ్ కు రంగం సిద్దం చేశారు.
క్రేజి మీడియా పతాకంపై ‘గీతాంజలి’ ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 6న విడుదల కానుంది. తమిళంలో ‘త్రిపుర సుందరి’గా వస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అనుకున్న కథను రాజకిరణ్ అద్భుతంగా తెరకెక్కించారు. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ అందించిన స్క్రీన్‌ప్లే ఓ హైలైట్. ‘స్వామి రారా, కార్తికేయ’ వంటి విజయాల తర్వాత స్వాతి నటించిన మరో తెలుగు చిత్రమిది. ఆ కోవలోనే ఇదీ హిట్టవు తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు.
‘‘త్రిపుర ఏం చేస్తుంది? ఆమె కథేంటి అనేది సస్పెన్స్. స్వాతి అద్భుతంగా నటించింది. నవీన్‌చంద్ర చేసిన పాత్ర అదనపు ఆకర్షణ. సప్తగిరి కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. హార్రర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 29న పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రాజా, ఛాయాగ్రహణం: రవికుమార్ సానా, సంగీతం: కమ్రాన్.
First Published:  26 Oct 2015 7:02 PM GMT
Next Story