Telugu Global
CRIME

మీడియాను చూసి మాఫియా డాన్‌ చోటా వణుకు

ఇండోనేషియాలో ఇంటర్‌పోల్‌కి చిక్కిన మాఫియా డాన్‌ చోటా రాజన్‌ పోలీసులకు చిక్కి వణికిపోయాడో లేదో తెలీదు కాని ఇండియన్‌ మీడియాను చూసి మాత్రం గజగజా వణికిపోయాడు. పాత్రికేయులను చూసిన వెంటనే ఈ డాన్ చోటా రాజన్‌ నిజంగానే షాక్‌కు గురయ్యాడు. చేతికి బేడీలతో పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి వెళ్లిన రాజన్‌ను ఇండియన్ మీడియా చుట్టుముట్టింది. ఈ అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైన రాజన్ కాసేపటి దాకా తేరుకోలేకపోయాడు. ఆ తర్వాత పాత్రికేయుల కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు […]

ఇండోనేషియాలో ఇంటర్‌పోల్‌కి చిక్కిన మాఫియా డాన్‌ చోటా రాజన్‌ పోలీసులకు చిక్కి వణికిపోయాడో లేదో తెలీదు కాని ఇండియన్‌ మీడియాను చూసి మాత్రం గజగజా వణికిపోయాడు. పాత్రికేయులను చూసిన వెంటనే ఈ డాన్ చోటా రాజన్‌ నిజంగానే షాక్‌కు గురయ్యాడు. చేతికి బేడీలతో పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి వెళ్లిన రాజన్‌ను ఇండియన్ మీడియా చుట్టుముట్టింది. ఈ అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైన రాజన్ కాసేపటి దాకా తేరుకోలేకపోయాడు. ఆ తర్వాత పాత్రికేయుల కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు నానా తంటాలు పడ్డాడు. చేతులతో మొహం దాచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులకు బేడీలతో జనానికి కనపడటాన్ని నామోషీగా ఫీలయ్యాడు. మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని తనకేదో మీడియా నుంచి ప్రాణహాని ఉన్నవాడిలా వణికిపోయాడు. మాఫియా డాన్‌గా కనుసైగలతో ముంబయి నగరాన్ని శాసించిన ఈ పులి పిల్లి మాదిరిగా మారిపోయి కనపడ్డాడు. చోటా షకీల్ నుంచి ప్రాణహాని ఉందా అని ప్రశ్నించగా తాను ఎవ్వరికీ భయపడబోనన్నాడు. మీడియా నుంచి చాలా ప్రశ్నలు ఎదురయినప్పటికీ ఏ ప్రశ్నకూ జవాబివ్వకుండా తప్పించుకున్నాడు.

First Published:  27 Oct 2015 7:01 PM GMT
Next Story