Telugu Global
Others

ఇక ఒక భార్యకు ఇద్దరు భర్తలు..?

బహు భర్తత్వంపై ఇపుడు చైనాలో చర్చ జరుగుతోంది. అమ్మాయిలు తక్కువైపోతున్నప్పుడు ఇద్దరబ్బాయిలు ఒకే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే తప్పేంటన్నది ఇపుడు చర్చ. దీన్ని కొంతమంది అనుసరిస్తుండగా మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇద్దర్ని కట్టుకునేందుకు అమ్మాయిలకు అనుమతి ఇవ్వాలని, ఈ విధానాన్ని చట్టబద్దం చేయాలని డిమాండు చేస్తున్న నేపథ్యంలో చైనా కూడా ఆదిశగా ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. అసలు సమస్య ఏమిటంటే… ప్రపంచ వ్యాప్తంగా పుట్టే పిల్లల్లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. అత్యధిక జనాభా కలిగిన చైనా కూడా […]

ఇక ఒక భార్యకు ఇద్దరు భర్తలు..?
X

బహు భర్తత్వంపై ఇపుడు చైనాలో చర్చ జరుగుతోంది. అమ్మాయిలు తక్కువైపోతున్నప్పుడు ఇద్దరబ్బాయిలు ఒకే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే తప్పేంటన్నది ఇపుడు చర్చ. దీన్ని కొంతమంది అనుసరిస్తుండగా మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇద్దర్ని కట్టుకునేందుకు అమ్మాయిలకు అనుమతి ఇవ్వాలని, ఈ విధానాన్ని చట్టబద్దం చేయాలని డిమాండు చేస్తున్న నేపథ్యంలో చైనా కూడా ఆదిశగా ఆలోచించే అవకాశం ఉందంటున్నారు. అసలు సమస్య ఏమిటంటే… ప్రపంచ వ్యాప్తంగా పుట్టే పిల్లల్లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. అత్యధిక జనాభా కలిగిన చైనా కూడా ఇందుకు మినహాయింపు కాదు. అక్కడ అబ్బాయిలు 117 మంది ఉంటే అమ్మాయిలు 100 మందే ఉంటున్నారు. ఇది ఇప్పటి లెక్క. క్రమంగా అమ్మాయిల సంఖ్య మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే… అక్కడ ఒక్క బిడ్డకే ప్రభుత్వ అనుమతి ఉంది. ఆ బిడ్డ కూడా మగాడే కావాలనుకుంటున్నారు దంపతులు. అమ్మాయిలు పుట్టే అవకాశమున్న సందర్భంలో ఇష్టంలేని వారు అక్రమ మార్గంలో అబార్షన్లు కూడా చేయించుకుంటున్నారు. ఫలితంగా ఆడ శిశువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. దీనివల్ల పెళ్ళికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది.

2020 నాటికి బ్యాచులర్స్ సంఖ్య 30 మిలియన్‌కు చేరవచ్చని అంచనా. దీంతో భార్యలను పంచుకోవడమే సమస్యకు పరిష్కారంగా ఆ దేశ ఆర్థిక నిఫుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఒక అమ్మాయితో ఇద్దరి మగవారి వివాహాన్ని చట్టబద్ధం చేస్తే మరింత మంచిదని సలహా ఇస్తున్నారు. జిహిజింగ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు ఎక్సియే జియోషి తన బ్లాగులలో ఈమేరకు ఉచిత సలహా ఇచ్చారు. కొంతమంది వ్యతిరేకించినా… ఊహించని విధంగా 2.6 మిలియన్ల మంది దీన్ని అనుసరించేశారు. ముఖ్యంగా పెళ్ళి అనేది అనూహ్యంగా మారిన పేద యువకులు అమ్మాయి దొరికితే చాలు… భార్యల్ని పంచుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తూ… రెండోసారి పెళ్ళి అయినా వెనుకాడడం లేదు. అయితే సంప్రదాయాలను మంటగలపొద్దంటూ స్త్రీవాదులు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

First Published:  27 Oct 2015 9:01 PM GMT
Next Story