Telugu Global
NEWS

టీడీపీని వెంటాడుతున్న రాజ్యసభ సెంటిమెంట్

రాజ్యసభ సభ్యత్వం అంటేనే తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఉలిక్కిపడుతోంది. పార్టీలో రాజ్యసభ సీటు పొందిన మెజారిటీ నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ కావడమే ఇందుకు కారణం. ఈ సెంటిమెంట్ ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు హయాంలోనూ కొనసాగుతోంది. ఇప్పుడు వరంగల్ కు చెందిన గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరుతోందన్న ప్రచారంతో రాజ్యసభ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది. మాజీ కేంద్రమంత్రి, ఒకప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న రేణుకా చౌదరి నుంచి సి. రామచంద్రయ్య, మైసూరారెడ్డి, […]

టీడీపీని వెంటాడుతున్న రాజ్యసభ సెంటిమెంట్
X

రాజ్యసభ సభ్యత్వం అంటేనే తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఉలిక్కిపడుతోంది. పార్టీలో రాజ్యసభ సీటు పొందిన మెజారిటీ నాయకులు ఇతర పార్టీల్లోకి జంప్ కావడమే ఇందుకు కారణం. ఈ సెంటిమెంట్ ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు హయాంలోనూ కొనసాగుతోంది. ఇప్పుడు వరంగల్ కు చెందిన గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరుతోందన్న ప్రచారంతో రాజ్యసభ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది.
మాజీ కేంద్రమంత్రి, ఒకప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న రేణుకా చౌదరి నుంచి సి. రామచంద్రయ్య, మైసూరారెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వంగాగీత, యలమంచిలి శివాజీ, మోహన్ బాబు, జయప్రద, సోలిపేట రామచంద్రారెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య ఇలా లిస్టు చాలా పెద్దదే. వీళ్లంతా టీడీపీ నుంచి రాజ్యసభ టిక్కెట్ పొంది పదవిలో ఉండగానే కొందరు, పదవీ కాలం పూర్తయిన తర్వాత కొందరు జంప్ అయ్యారు.
ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం కేసీఆర్ ను కలిసి తన అభిమతాన్ని తెలియజేశారు. ఎమ్మెల్యేగా గెలవని గుండు సుధారాణిని కార్పొరేటర్‌ స్థాయి నుంచి రాజ్యసభకు పంపిస్తే అమె కూడా పార్టీకి హ్యాండ్‌ ఇస్తోందంటున్నారు.
అయితే పార్టీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక విధానంలోనే లోపాలు ఉన్నాయని కిందిస్థాయి నాయకులు అభిప్రాయపడుతున్నారు. చివరి వరకు రాజ్యసభకు పంపేవారి పేర్లు గోప్యంగా ఉంచడం.. చివరి నిమిషంలో ఊహించని కొత్త వ్యక్తి తెరపైకి రావడం జరుగుతోంది. ఇలాంటి వాళ్లను రాజ్యసభకు పంపితే పార్టీకి విశ్వాసంగా ఎలా ఉంటారని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.

First Published:  28 Oct 2015 2:25 AM GMT
Next Story