Telugu Global
NEWS

జూన్‌లోపు ఉద్యోగులు రావాల్సిందే: చంద్రబాబు

‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అడిగినవన్నీ ఇచ్చాను. ఇంక నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మీకు తాత్కాలిక బస ఏర్పాటు చేస్తాను. రాజధానికి వచ్చేయండి’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులకు మొర పెట్టుకున్నారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ‘నేను రాజధానిలో ఉండి పాలన సాగిస్తున్నప్పుడు మీరు హైదరాబాద్‌లో ఉంటే ప్రజలకు ఎన్ని ఇబ్బందులుంటాయో ఆలోచించండి. పాలన ఎప్పుడూ ప్రజలకు చేరువలో ఉండాలి. అందుకే మీరు కూడా అమరావతికి వచ్చేయండి. దయచేసి నన్ను ఇబ్బంది […]

జూన్‌లోపు ఉద్యోగులు రావాల్సిందే: చంద్రబాబు
X

‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అడిగినవన్నీ ఇచ్చాను. ఇంక నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మీకు తాత్కాలిక బస ఏర్పాటు చేస్తాను. రాజధానికి వచ్చేయండి’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులకు మొర పెట్టుకున్నారు. విజయవాడలోని సీఎం కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ‘నేను రాజధానిలో ఉండి పాలన సాగిస్తున్నప్పుడు మీరు హైదరాబాద్‌లో ఉంటే ప్రజలకు ఎన్ని ఇబ్బందులుంటాయో ఆలోచించండి. పాలన ఎప్పుడూ ప్రజలకు చేరువలో ఉండాలి. అందుకే మీరు కూడా అమరావతికి వచ్చేయండి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు’ అని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అయినా మీ ప్రయోజనాలు నెరవేర్చడంలో వెనుకంజ వేయలేదని, ఉద్యోగులు కూడా ఆలోచించాలని ఆయన కోరారు. పిల్లల చదువు మధ్యలో ఉన్నప్పుడు రావడం ఎలా సాధ్యమవుతుందన్న ఉద్యోగ నాయకుల ప్రశ్నకు తాత్కాలికంగా మీరు రావాలని, తాను తాత్కాలిక బస కూడా ఏర్పాటు చేస్తానని, జూన్‌లో పూర్తిస్థాయిలో మీరు రావాల్సిందేనని బదులిచ్చారు. అయితే ఉద్యోగులు కోరుతున్నట్టు రెండు చోట్ల హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడం సాధ్యం కాదని, నవ్యాంధ్ర నిర్మాణానికి త్యాగాలు తప్పవని ఆయన అన్నారు.

First Published:  29 Oct 2015 6:39 AM GMT
Next Story