Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్‌ ధారణ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ ధారణ తప్పని చేయాలని కృత నిశ్చయానికి వచ్చాయి. వాహన చోదకులకు ముందుగా అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, ఏపీలో మాత్రం నవంబర్‌ 1 నుంచి వాహనదారులు హెల్మెట్‌‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ నిబంధనను ఉల్లంఘింస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అయినా ఈ నిబంధనను తొలిసారిగా ఉల్లంఘిస్తే రూ.100 జరిమానా మాత్రమే విధిస్తామని, […]

తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్‌ ధారణ తప్పనిసరి
X

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ ధారణ తప్పని చేయాలని కృత నిశ్చయానికి వచ్చాయి. వాహన చోదకులకు ముందుగా అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, ఏపీలో మాత్రం నవంబర్‌ 1 నుంచి వాహనదారులు హెల్మెట్‌‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ నిబంధనను ఉల్లంఘింస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అయినా ఈ నిబంధనను తొలిసారిగా ఉల్లంఘిస్తే రూ.100 జరిమానా మాత్రమే విధిస్తామని, రెండోసారి ఉల్లంఘనకు కఠిన చర్యలు తప్పవని తెలిపారు. రెండోసారి నిబంధనను అతిక్రమిస్తే బైక్‌ సీజ్‌ చేయడమే కాకుండా లైసెన్స్‌ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆర్టీఏ కార్యాలయాల వద్ద దళారీ వ్యవస్థను రూపు మాపే చర్యల్లో భాగంగా జనవరి నుంచి అన్ని సేవలకు అన్‌లైన్‌లోనే దరఖాస్తులు చేసుకోవాలని బాలసుబ్రమణ్యం తెలిపారు.
1న హెల్మెట్‌ల వాడకంపై హైదరాబాద్‌లో భారీ ర్యాలీ
హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ నవంబర్‌ 1న భారీ ర్యాలీని హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. హెల్మెట్‌ ధారణకు సంబంధించి ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో ద్విచక్ర వాహన డీలర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా శాఖ కమిషనర్‌ టి.రఘునాథ్‌ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్‌ వాడాలన్న నిబంధన ఉంది. దాన్ని అమలు చేసేందుకు విస్తృత్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఆదివారం నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా నుంచి చార్మినార్‌ వరకు ద్విచక్ర వాహనదారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.

First Published:  28 Oct 2015 9:36 PM GMT
Next Story