Telugu Global
CRIME

లష్కరే నేత అబూఖాసిం ఎన్‌కౌంటర్‌

జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరేతోయిబాకు చెందిన తీవ్రవాద నేత హతమయ్యాడు. కుల్గాం ప్రాంతంలో తీవ్రవాదులకు ఆర్మీ జవాన్లకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్‌ అబూఖాసిం హతమయ్యారు. ఇతని కోసం భద్రతా దళాలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాయి. అబూఖాసిం ఉధంపూర్‌ దాడి ఘటనలో ప్రధాన సూత్రధారి అని సైనిక వర్గాలు తెలిపాయి. ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు గాయాలు అయ్యాయి. అబూఖాసిం ఎన్‌కౌంటర్‌తో జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు […]

లష్కరే నేత అబూఖాసిం ఎన్‌కౌంటర్‌
X

జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరేతోయిబాకు చెందిన తీవ్రవాద నేత హతమయ్యాడు. కుల్గాం ప్రాంతంలో తీవ్రవాదులకు ఆర్మీ జవాన్లకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్‌ అబూఖాసిం హతమయ్యారు. ఇతని కోసం భద్రతా దళాలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నాయి. అబూఖాసిం ఉధంపూర్‌ దాడి ఘటనలో ప్రధాన సూత్రధారి అని సైనిక వర్గాలు తెలిపాయి. ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్కు గాయాలు అయ్యాయి. అబూఖాసిం ఎన్‌కౌంటర్‌తో జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అవాంఛనీయ సంఘటనలకు అవకాశమున్న జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించి గస్తీని తీవ్రతరం చేశారు.
భారత్‌లో లష్కరే తోయిబా చీఫ్‌గా వున్న ఖాసిమ్ ఈ ఏడాది ఆగస్టులో పంజాబ్‌ ఉదమ్‌పూర్‌లో బీఎస్‌ఎఫ్‌ కాన్వాయ్‌పై దాడికి స్కెచ్‌ వేశాడు. ఉదమ్‌పూర్‌లో పోలీసు స్టేషన్లే టార్గెట్‌గా దాడి చేశారు. ఆ ఆపరేషన్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది మహ్మద్‌ నవీద్ అలియాస్ ఉస్మాన్‌ను భద్రతా దళాలు వెంటాడి పట్టుకున్నాయి. అతడ్ని విచారించినప్పుడు లష్కరే తోయిబా కుట్ర బయటపడింది. అప్పటి నుంచి ఖాసిస్‌ కదలికలపై భద్రతాదళాలు నిఘా పెట్టాయి. ఎన్ఐఏ అధికారులు కూడా ఖాసిమ్‌ కోసం వెతుకుతున్నారు. ఖాసిమ్‌ తలపై 20 లక్షల రివార్డ్‌ కూడా ఉంది.

First Published:  28 Oct 2015 5:01 PM GMT
Next Story