Telugu Global
CRIME

నైజీరియా జైల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా ఇంజినీర్‌!

ఆఫ్రికాలోని ఘనాలో ఓ షిప్పింగ్‌ కంపెనీలో పని చేస్తున్న మనోజ్‌ కుమార్‌ అనే యువకుడు చేయని పాపానికి దాదాపు పదిహేను నెలల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దశరథ్ దంపతుల కుమారుడు మనోజ్‌కుమార్. 2013లో ఘనాలోని ఓ షిప్పింగ్ కంపెనీలో మెరైన్ ఇంజనీర్‌గా చేరారు. 2014 జులైలో ఘనా నుంచి కెమెరూన్‌కు స్ర్కాప్‌ను షిప్‌లో తరలిస్తుండగా అది సముద్రంలో చెడిపోయింది. దానికి మరమ్మతులు చేయడానికి నెలరోజులు పట్టింది. ఈ నేపథ్యంలో దేశంలోకి అక్రమంగా చొరబడ్డారనే […]

ఆఫ్రికాలోని ఘనాలో ఓ షిప్పింగ్‌ కంపెనీలో పని చేస్తున్న మనోజ్‌ కుమార్‌ అనే యువకుడు చేయని పాపానికి దాదాపు పదిహేను నెలల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దశరథ్ దంపతుల కుమారుడు మనోజ్‌కుమార్. 2013లో ఘనాలోని ఓ షిప్పింగ్ కంపెనీలో మెరైన్ ఇంజనీర్‌గా చేరారు. 2014 జులైలో ఘనా నుంచి కెమెరూన్‌కు స్ర్కాప్‌ను షిప్‌లో తరలిస్తుండగా అది సముద్రంలో చెడిపోయింది. దానికి మరమ్మతులు చేయడానికి నెలరోజులు పట్టింది. ఈ నేపథ్యంలో దేశంలోకి అక్రమంగా చొరబడ్డారనే అభియోగాలపై షిప్‌లో ఉన్న మనోజ్‌తో పాటు మరో పదిమందిని నైజీరియా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తన కుమారుడి అరెస్ట్‌ విషయం తల్లిదండ్రులకు తెలిసేసరికే యేడాది పట్టిందని మనోజ్‌ తండ్రి దశరథ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా ఇప్పటివరకు విడుదల కాలేదని తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే తాము కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిశామని, తమ కొడుకును క్షేమంగా తీసుకురావాలని విజ్ఞప్తి చేశామని మనోజ్ తలిదండ్రులు తెలిపారు. అక్టోబర్‌లో మనోజ్‌తోపాటు మిగిలిన వారిని విడిపిస్తామని సుష్మాస్వరాజ్ మాటిచ్చారు. కానీ ఆ హామీ అమలు కాలేదని, ఇపుడు ఇండో-ఆఫ్రికా సదస్సులో పాల్గొనడానికి వచ్చిన నైజీరియా అధ్యక్షుడితో మాట్లాడి తమ కుమారుడు మనోజ్‌ను విడిపించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వారు ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ భారత పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని మనోజ్ తల్లిదండ్రులు వినతి చేశారు.

First Published:  28 Oct 2015 5:03 PM GMT
Next Story