Telugu Global
CRIME

రూ. 42 లక్షల మైనారిటీల రుణ సబ్సిడీ స్వాహా

కొంతమంది మైనారిటీ వ్యక్తుల పేర్ల మీద రుణాలు తీసుకుని, వాటిపై వచ్చిన 42 లక్షల రూపాయల సబ్సిడీని స్వాహా చేసిన కేసులో నలుగురు కటకటాల పాలయ్యారు. నిందితుల్లో నంద్యాల 10వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ కరీముల్లా, అతడి బావమరిది మహమ్మద్‌ రఫీ, మహమ్మద్‌గౌస్‌, షేక్‌ అన్వర్‌బాషా ఉన్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు ఎస్పీ రవికృష్ణ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. నంద్యాలకు చెందిన 10వ వార్డు కౌన్సిలర్‌ కరీమల్లాకు మైనార్టీ కార్పొరేషన్‌లో కొంత పలుకుబడి ఉంది. […]

కొంతమంది మైనారిటీ వ్యక్తుల పేర్ల మీద రుణాలు తీసుకుని, వాటిపై వచ్చిన 42 లక్షల రూపాయల సబ్సిడీని స్వాహా చేసిన కేసులో నలుగురు కటకటాల పాలయ్యారు. నిందితుల్లో నంద్యాల 10వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ కరీముల్లా, అతడి బావమరిది మహమ్మద్‌ రఫీ, మహమ్మద్‌గౌస్‌, షేక్‌ అన్వర్‌బాషా ఉన్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు ఎస్పీ రవికృష్ణ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. నంద్యాలకు చెందిన 10వ వార్డు కౌన్సిలర్‌ కరీమల్లాకు మైనార్టీ కార్పొరేషన్‌లో కొంత పలుకుబడి ఉంది. దీంతోపాటు వివిధ బ్యాంకుల మేనేజర్లతో పరిచయాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని ఈ ఏడాది మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం సబ్సిడీ కింద విడుదల చేసిన బడ్జెట్‌పై కన్నేశాడు. మైనార్టీ రుణాల సబ్సిడీని స్వాహా చేయాలని పథకం రూపొందించుకున్నాడు. లేని వ్యక్తుల పేరు మీద రుణాలు తీసుకుని, వారికి వచ్చిన సబ్సిడీని స్వాహా చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. వచ్చిన సబ్సిడీ రూ. 42 లక్షలను వాటాలుగా పంచుకున్నారు. బ్యాంకులో లబ్ధిదారుల ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు కూడా సహకరించినట్లు సమాచారం. నిందితుల నుంచి 39 సీళ్లు, 48 బ్యాంకు పాస్‌బుక్‌లు, రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

First Published:  28 Oct 2015 5:05 PM GMT
Next Story