Telugu Global
National

అనూహ్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవర్ చంద్రభానుకు ముంబై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు శిక్షను ఖరారు చేస్తూ ముంబై సెషన్స్ కోర్టు తన తీర్పును వెల్లడించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబైలోని టీసీఎస్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. క్రిస్ మస్ సెలవులకు వచ్చిన అనూహ్య జనవరి 4న మచిలీపట్నం నుంచి ముంబైకి రైళ్లో బయల్దేరింది. జనవరి 5న లోకమాన్య తిలక్ […]

అనూహ్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
X
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవర్ చంద్రభానుకు ముంబై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు శిక్షను ఖరారు చేస్తూ ముంబై సెషన్స్ కోర్టు తన తీర్పును వెల్లడించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబైలోని టీసీఎస్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. క్రిస్ మస్ సెలవులకు వచ్చిన అనూహ్య జనవరి 4న మచిలీపట్నం నుంచి ముంబైకి రైళ్లో బయల్దేరింది. జనవరి 5న లోకమాన్య తిలక్ స్టేషన్‌లో రైలు దిగింది.
ట్యాక్సీ కోసం ఎదురుచూస్తున్న అనూహ్యకు టాక్సీ డ్రైవర్ చంద్రభాను మాయమాటలు చెప్పి శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. దాదాపు 11 రోజుల తర్వాత అనూహ్య జాడ తెలియలేదు. ఆతర్వాత కుళ్లిపోయిన స్థితిలో అనూహ్య మృతదేహం లభించింది. అనూహ్య చేతికి ఉన్న వాచ్, రింగు ఆధారంగా తండ్రి జోనాధన్ తన కూతురుగా గుర్తించాడు. మొదట ఈకేసును విచారించేందుకు ముంబై పోలీసులు ఆసక్తి చూపలేదు. చివరకు అనూహ్య తండ్రి జోనాధన్, మీడియా ఒత్తిడితో కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కేవలం రెండు నెలల వ్యవధిలోనే సీసీ ఫుటేజ్ లో ఉన్న విజివల్స్ ఆధారంగా డ్రైవర్ చంద్రభానును పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 22నెలల పాటు కేసు విచారణ జరిగింది. తర్వాత 36 ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సుమారు 2500మంది సాక్షులను విచారించారు. ఈఘటనపై ముంబాయి పోలీసులు అన్ని ఆధారాలతో కోర్టుకు 1300 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. అనంతరం కేసు విచారించిన ముంబయి సెషన్స్ కోర్టు చంద్రభానును దోషిగా తేల్చింది. తీర్పును రెండు సార్లు వాయిదా వేసిన ముంబై సెషన్స్ కోర్టు చివరకు చంద్రభానుకు ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది.
ముంబై కోర్టు తీర్పుపై మచిలీపట్నంలో ఉన్న అనూహ్య తండ్రి జోనాధన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేరస్తులకు గుణపాఠంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అనూహ్యను డ్రైవర్ చంద్రభాను అమానుషంగా పొట్టనపెట్టుకున్నాడని ఇలాంటి వ్యక్తులకు ఈ తీర్పు గుణపాఠం కావాలని ఆయన ఆకాంక్షించారు.
అయితే చంద్రభానుకు ముంబై కోర్డు విధించిన ఉరిశిక్షపై మహారాష్ట్ర హైకోర్టు అనుమతి రావాల్సి ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. సాంకేతికంగా హైకోర్టు ఆమోదం పొందిన తర్వాతే చంద్రభానుకు ఉరిశిక్ష తేదీని ఖరారు చేస్తారు.
First Published:  30 Oct 2015 1:50 AM GMT
Next Story