Telugu Global
Others

ప్రత్యేక కౌంటర్లు వద్దు... నిజాయితీగా దాడులు చేయండి

కందిపప్పు ధర ఆకాశాన్నంటింది. జనం గగ్గోలు పెట్టడంతో కంటితుడుపుచర్యగా కొన్ని గోడౌన్‌లమీద దాడులుచేసారు. వేలాది టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు తెరిచి కొంచెం తక్కువ ధరకు ప్రభుత్వమే కందిపప్పును అందజేస్తుంది. ఈ నాటకాలన్నీ దేనికి? ప్రభుత్వ ప్రత్యేక కౌంటర్లలో ఇచ్చేది ఒక కిలో. దానికోసం కిలోమీటర్లకొద్ది క్యూలు. జనం టైం లక్షలాదిగంటలు వృధా. గతంలో ఉల్లిపాయల ధర పెరిగినప్పుడు కూడా ఇదే తంతు. ఒక కిలోనో, రెండు కిలోలో ప్రత్యేక కౌంటర్లలో […]

ప్రత్యేక కౌంటర్లు వద్దు... నిజాయితీగా దాడులు చేయండి
X

కందిపప్పు ధర ఆకాశాన్నంటింది. జనం గగ్గోలు పెట్టడంతో కంటితుడుపుచర్యగా కొన్ని గోడౌన్‌లమీద దాడులుచేసారు. వేలాది టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు తెరిచి కొంచెం తక్కువ ధరకు ప్రభుత్వమే కందిపప్పును అందజేస్తుంది. ఈ నాటకాలన్నీ దేనికి?
ప్రభుత్వ ప్రత్యేక కౌంటర్లలో ఇచ్చేది ఒక కిలో. దానికోసం కిలోమీటర్లకొద్ది క్యూలు. జనం టైం లక్షలాదిగంటలు వృధా. గతంలో ఉల్లిపాయల ధర పెరిగినప్పుడు కూడా ఇదే తంతు. ఒక కిలోనో, రెండు కిలోలో ప్రత్యేక కౌంటర్లలో అందజేయడం, దానికోసం వేలాది జనం గంటల తరబడి క్యూలలో పడిగాపులుకాయడం. ఇవన్నీ అవసరమా?
ఈ ప్రత్యేక కౌంటర్లను నిర్వహించడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత? అదంతా ప్రజల జేబుల్లోంచి వసూలు చేస్తున్నదే కదా?
కందిపప్పు అమ్మకాలమీద మీరిస్తున్న సబ్సిడీకూడా ప్రజలుకడుతున్న పన్నుల్లోంచి చెల్లిస్తున్నదే కదా? ఇవన్నీ అవసరమా?
లక్షల టన్నుల పప్పు ధాన్యాలు అక్రమంగా నిల్వచేసిన వ్యాపారస్తులు దొరుకుతున్నారు. వాళ్ళను కఠినంగా శిక్షిస్తే మరోసారి ఇలాంటి అక్రమనిల్వలకు పాల్పడతారా? వాళ్ళమీద పెద్దగా చర్యలేమి చేపట్టకుండా ప్రభుత్వాలు వాళ్ళ కాళ్ళుపట్టుకొని బ్రతిమిలాడుకోవడం దేనికి? దయచేసి కిలో కందిపప్పు 160కి అమ్మండి, 150కి అమ్మండి అని ప్రభుత్వం వ్యాపారస్తులను దేబిరించడం దేనికి? అక్రమనిల్వదారులతో కఠినంగా వ్యవహరిస్తే సరిపోదా?
సరుకులను అక్రమంగా నిల్వచేసి ధరలు అమాంతం పెంచేసి, జనాల జేబులు దోచుకున్నాక దొంగలుపడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టు ప్రభుత్వం ఏవో దాడులుచేయడం, వాళ్ళమీద కంటితుడుపు కేసులు పెట్టడం, వాళ్ళ కాళ్ళావేళ్ళా పడి మార్కెట్‌లో వాటి ధరలు తగ్గించమని బ్రతిమిలాడుకోవడం – ఇదంతా ఎవరికోసం? ఈసారికి వాళ్ళు ప్రభుత్వంమీద దయతలచి మార్కెట్‌లో కందిపప్పు ధర తగ్గించినా, రేపు మరో సరుకు ధర పెరగదని నమ్మకం ఏమిటి?

First Published:  30 Oct 2015 1:31 AM GMT
Next Story