Telugu Global
NEWS

శ్రీకాంత్‌తోనే జరిగిన గాయని మధుప్రియ పెళ్లి

వర్ధమాన గాయని మధు ప్రియ, రియల్టర్‌ శ్రీకాంత్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగజ్‌నగర్‌కు చెందిన మంగి శ్రీకాంత్ అనే యువకుడు, మధు ప్రియ రెండేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. నెల రోజుల క్రితమే మధుప్రియకు మైనారిటీ తీరడంతో ఇరు కుటుంబాల్లో చెప్పి వివాహ ఏర్పాట్లు చేసుకున్నారు. కాని వీరి వివాహనం మధుప్రియ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దాంతో వీరి వివాహాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. గురువారంరాత్రి సైతం వరుడి ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం. […]

శ్రీకాంత్‌తోనే జరిగిన గాయని మధుప్రియ పెళ్లి
X

వర్ధమాన గాయని మధు ప్రియ, రియల్టర్‌ శ్రీకాంత్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగజ్‌నగర్‌కు చెందిన మంగి శ్రీకాంత్ అనే యువకుడు, మధు ప్రియ రెండేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. నెల రోజుల క్రితమే మధుప్రియకు మైనారిటీ తీరడంతో ఇరు కుటుంబాల్లో చెప్పి వివాహ ఏర్పాట్లు చేసుకున్నారు. కాని వీరి వివాహనం మధుప్రియ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దాంతో వీరి వివాహాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. గురువారంరాత్రి సైతం వరుడి ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం. దీంతో భయాందోళన చెందిన వరుడు, అతని తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని మధు ప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిసినప్పటికీ ఆమె నిర్ణయం మారలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. మొత్తమీద వివాదాలకు, ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ ముందుగా అనుకున్న విధంగానే సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో తన అబీష్టం మేరకు ప్రియుడు శ్రీకాంత్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఆడపిల్లలపై చూపే వివక్షను తన గళంతో పాటల రూపంలో నిరసించే మధుప్రియ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్న తల్లిదండ్రులను సైతం ప్రక్కకునెట్టి వైవాహిక జీవితంలోకి ధైర్యంగా ముందడుగేసింది.

First Published:  30 Oct 2015 6:23 AM GMT
Next Story