నన్ను అవమానిస్తున్నారు

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాపోలు భాస్కరరావు రాష్ట్ర పార్టీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనను అవమానిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బీసీని కాబట్టే ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు.  రాహుల్ గాంధీ ఆదిలాబాద్ వచ్చిన సమయంలో ఎంపీని అయిన తనను కనీసం వేదిక వద్దకు కూడా రానివ్వలేదని రుసురుసలాడారు . వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి కోసం తన అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కావాలనే తనను అవమానిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తనను అవమానించినప్పటికీ వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేస్తానన్నారు రాపోలు. అయితే  రాపోలు ఆగ్రహాన్ని ఊహించలేదంటున్నారు నేతలు. అసలు రాపోలు ఇలా ఫీల్ అవుతున్నారన్న విషయం కూడా గుర్తించలేకపోయామని చెబుతున్నారు