Telugu Global
CRIME

రూ. 40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

బంగ్లాదేశ్ నుండి భారత్‌కు సరిహద్దు ద్వారా తరలిస్తున్న పది కిలోల కొకైన్‌ను సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్లోని ఉత్తర పరగణాల జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ ట్రక్కు రావడం బీఎస్‌ఎఫ్‌ దళాలు గుర్తించాయి. బంగ్లాదేశ్ నుండి వస్తున్న ఈ ట్రక్కులో పౌడర్ను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, టెస్టింగ్ కోసం నార్కోటిక్ లాబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ల్యాబ్‌ జరిపిన ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ద కోకైన్గా తేలింది. దాని విలువ సుమారు […]

రూ. 40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
X

బంగ్లాదేశ్ నుండి భారత్‌కు సరిహద్దు ద్వారా తరలిస్తున్న పది కిలోల కొకైన్‌ను సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్లోని ఉత్తర పరగణాల జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ ట్రక్కు రావడం బీఎస్‌ఎఫ్‌ దళాలు గుర్తించాయి. బంగ్లాదేశ్ నుండి వస్తున్న ఈ ట్రక్కులో పౌడర్ను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, టెస్టింగ్ కోసం నార్కోటిక్ లాబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ల్యాబ్‌ జరిపిన ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ద కోకైన్గా తేలింది. దాని విలువ సుమారు రూ. 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ప్రకటించారు.

First Published:  30 Oct 2015 10:57 AM GMT
Next Story