Telugu Global
Cinema & Entertainment

ప్ర‌భాస్‌కి అంతా ఆయ‌నే

బాహుబ‌లి సినిమాతో బాలీవుడ్‌ను ఉలిక్కిప‌డేలా చేసిన హీరో ప్ర‌భాస్‌.. త్వ‌ర‌లోనే పెళ్లికొడుకు కానున్నాడు. భీమ‌వరానికి చెందిన ఓ సంబంధానికి ప్ర‌భాస్ ఓకే చెప్పాడ‌ని, నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని బాహుబ‌లి-2 పూర్తికాగానే.. వివాహ‌మ‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్ర‌భాస్ నాలుగైదేళ్లుగా ఏ విష‌యంలోనూ స్వంత నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. ప్ర‌భాస్ వ్య‌వ‌హారాల‌న్నింటినీ ఓ పెద్ద‌మనిషి ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. క‌థ నుంచి కాస్టూమ్స్ వ‌ర‌కు ప్ర‌తి విషయంలోనూ ఆయ‌న‌దే తుదినిర్ణ‌యం. అందుకే ఐదేళ్లుగా ప్ర‌భాస్ గ్రాఫ్ ఏటేటా పెరుగుతూనే […]

ప్ర‌భాస్‌కి అంతా ఆయ‌నే
X
బాహుబ‌లి సినిమాతో బాలీవుడ్‌ను ఉలిక్కిప‌డేలా చేసిన హీరో ప్ర‌భాస్‌.. త్వ‌ర‌లోనే పెళ్లికొడుకు కానున్నాడు. భీమ‌వరానికి చెందిన ఓ సంబంధానికి ప్ర‌భాస్ ఓకే చెప్పాడ‌ని, నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని బాహుబ‌లి-2 పూర్తికాగానే.. వివాహ‌మ‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్ర‌భాస్ నాలుగైదేళ్లుగా ఏ విష‌యంలోనూ స్వంత నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. ప్ర‌భాస్ వ్య‌వ‌హారాల‌న్నింటినీ ఓ పెద్ద‌మనిషి ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. క‌థ నుంచి కాస్టూమ్స్ వ‌ర‌కు ప్ర‌తి విషయంలోనూ ఆయ‌న‌దే తుదినిర్ణ‌యం. అందుకే ఐదేళ్లుగా ప్ర‌భాస్ గ్రాఫ్ ఏటేటా పెరుగుతూనే ఉంది.
డార్లింగ్‌తో మొద‌లు..!
2002లో ఈశ్వ‌ర్‌తో తెలుగుతెర‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌ర‌కు 17 సినిమాల్లో హీరోగా న‌టించారు. వ‌ర్షం, ఛ‌త్ర‌ప‌తి, బిల్లా తాజాగా బాహుబ‌లి సినిమాలు ప్ర‌భాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌లుగా నిలిచాయి. మిగిలిన‌వ‌న్నీ సోసోగా ఆడాయి. పౌర్ణ‌మి, బుజ్జిగాడు, యోగి, ఏక్ నిరంజ‌న్ సినిమాలతో వ‌రుస ఫ్లాపులు చ‌విచూశాడు ప్ర‌భాస్. దీంతో ఒక ద‌శ‌లో ప్ర‌భాస్ కెరీర్ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింది. అప్పుడు ఓ పెద్ద‌మ‌నిషి ప్ర‌భాస్ బాధ్య‌త‌ను తీసుకున్నాడు. డార్లింగ్ సినిమా క‌థ మొద‌ట ఆయ‌నే విని, మార్పులు కూడా సూచించార‌ట‌. అప్ప‌టి నుంచి ప్ర‌భాస్ కెరీర్ లో రెబెల్ త‌ప్పితే.. అప‌జ‌యాలు లేవంటే కార‌ణం ఆ పెద్ద‌మ‌నిషే! కేవ‌లం క‌థ‌ల విష‌యంలోనే కాదు ప్ర‌భాస్ ఫిజిక్‌, ఫిట్‌నెస్ విష‌యంలో ఆయ‌న మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుంటార‌ట‌.
భీమ‌వ‌రం సంబంధం ఆయ‌నే మాట్లాడార‌ట‌..!
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని త‌మ దూర‌పు బంధువుల అమ్మాయితోనే ప్ర‌భాస్‌కి నిశ్చితార్థం జ‌రిగింద‌ని స‌మాచారం. ఈ పెళ్లి నిశ్చ‌యం వెన‌క కూడా ఆ పెద్ద‌మ‌నిషిదే కీల‌క నిర్ణ‌యం. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే.. 2017 సంవ‌త్స‌రం ఆరంభంలోనే ప్ర‌భాస్ పెళ్లికొడుక‌వుతాడు.. ఇంత‌కీ ఆ పెద్ద మ‌నిషి ఎవ‌ర‌నే క‌దా..మీ ఉత్కంఠ‌.. ఇంకెవ‌రు ఆయ‌న పెద‌నాన్న‌.. రెబ‌ల్ స్టార్ కృష్టంరాజు. సినిమాల్లో విల‌న్ల‌ను ఒంటి చేత్తో విసిరేసే ప్ర‌భాస్‌ పెద‌నాన్న కృష్ణంరాజు పిలిస్తే.. నిద్ర‌లో ఉన్నా ఉలిక్కిప‌డి లేచి వ‌స్తాడంటే.. వారి అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమా నేప‌థ్య‌మున్న కుటుంబాల్లో పిల్ల‌ల‌ను అంత క్ర‌మ‌శిక్ష‌ణ‌గా పెంచ‌డ‌మంటే మాట‌లు కాదు. ప్ర‌భాస్ త‌న‌ త‌మ్ముడి కొడుకైనా క‌న్న‌ కొడుకు కంటే.. ప్రాణంగా చూసుకుంటారు కృష్ణంరాజు.. మ‌రి అదండీ విష‌యం!
First Published:  29 Oct 2015 7:03 PM GMT
Next Story