Telugu Global
NEWS

వరంగల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పి.దయాకర్

వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ అధిష్టానం పసునూరి దయాకర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు అభ్యర్థి ఎంపికపై ఈమేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్ధిత్వం కోసం పలువురు పోటీ పడినప్పటికీ కులం, ఆర్ధిక, అంగబలాలను దృష్టిలో పెట్టుకుని పసునూరి దయాకర్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొన్న దయాకర్ … […]

వరంగల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పి.దయాకర్
X

వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ అధిష్టానం పసునూరి దయాకర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు అభ్యర్థి ఎంపికపై ఈమేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్ధిత్వం కోసం పలువురు పోటీ పడినప్పటికీ కులం, ఆర్ధిక, అంగబలాలను దృష్టిలో పెట్టుకుని పసునూరి దయాకర్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొన్న దయాకర్ … గతంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. పసునూరి దయాకర్ గతంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్‌ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల పట్టుసడలని విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్‌కు టీఆర్‌ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. ఇప్పటి అభ్యర్థి ఎంపికలో ఇవన్నీ ఆయనకు అనుకూలంగా పని చేశాయని తెలుస్తోంది. నిన్నటివరకూ రేసులో ముందు ఉన్న రవికుమార్‌ను… కుల వివాదం కారణంగా పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో దయాకర్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం వరంగల్‌ టికెట్‌ను ఆశించి భంగపడిన గుడిమళ్ల రవికుమార్‌కు త్వరలోనే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రముఖ స్థానాన్ని కల్పించాలని సీఎం నిర్ణయించారు.

First Published:  30 Oct 2015 10:15 AM GMT
Next Story