Telugu Global
NEWS

వివేక్ వెన‌క‌డుగు ఎందుకు..?

వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు మాజీ ఎంపీ వివేక్ విముఖ‌త వ్యక్తం చేస్తున్నారు. తాను పెద్ద‌పల్లి నుంచి త‌ప్ప మ‌రే స్థానానికి వెళ్లేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో గ‌తవారం అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డితోపాటు వెళ్లిన వివేక్ తాను వ‌రంగ‌ల్‌లో పోటీ చేయ‌న‌ని తెగేసి చెప్పారు. గురువారం గాంధీభ‌వ‌న్‌లో రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హార‌ల ఇన్‌చార్జి దిగ్విజ‌య్ సింగ్ మ‌రోసారి వివేక్‌ను బుజ్జ‌గించారు. అయినా.. వ‌రంగ‌ల్ నుంచి పోటీ చేసే ఆలోచ‌న […]

వివేక్ వెన‌క‌డుగు ఎందుకు..?
X
వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు మాజీ ఎంపీ వివేక్ విముఖ‌త వ్యక్తం చేస్తున్నారు. తాను పెద్ద‌పల్లి నుంచి త‌ప్ప మ‌రే స్థానానికి వెళ్లేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో గ‌తవారం అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డితోపాటు వెళ్లిన వివేక్ తాను వ‌రంగ‌ల్‌లో పోటీ చేయ‌న‌ని తెగేసి చెప్పారు. గురువారం గాంధీభ‌వ‌న్‌లో రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హార‌ల ఇన్‌చార్జి దిగ్విజ‌య్ సింగ్ మ‌రోసారి వివేక్‌ను బుజ్జ‌గించారు. అయినా.. వ‌రంగ‌ల్ నుంచి పోటీ చేసే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని మ‌రోసారి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.
అంగబ‌లం అర్ధం బ‌లం దండిగానే..!
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంగ‌బ‌లం, అర్ధ‌బ‌లం ఉన్న నాయ‌కుడు వివేక్ ఒక్క‌డే అంటే అతిశ‌యోక్తి కాదు. పైగా అనుచ‌ర గ‌ణం కూడా బాగానే ఉంది. తెలంగాణ‌వాది, తండ్రి జి.వెంక‌ట‌స్వామి మొద‌టి నుంచి కేంద్రమంత్రిగా ప‌లుమార్లు ప‌నిచేశారు. వీ-6 చాన‌ల్ ద్వారా తెలంగాణ ఉద్య‌మాన్ని ప్ర‌తి ఇంటికీ తీసుకెళ్లాడు. యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. సాక్షాత్తు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించుకుని వ‌రంగ‌ల్‌లో పోటీ చేయాల‌ని కోరినా.. వివేక్ విన‌లేదు.
ఎందుకంటే..?
సామాజిక స‌మీక‌ర‌ణాల‌తోనే వివేక్ పోటీకి వెన‌క‌డుగు వేస్తున్నార‌న్నది విశ్వ‌స‌నీయ స‌మాచారం. వివేక్ మాల సామాజిక వ‌ర్గానికి చెందినవారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు ప‌రిధిలో మాదిగ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు అధికం. టీఆర్ ఎస్ గాలి వీస్తోన్న ఈ ప‌రిస్థితుల్లో అక్క‌డ పోటీ చేస్తే.. ఓడిపోతాన‌న్న ఆందోళ‌న‌తోనే వివేక్ వెన‌క‌డుగు వేస్తున్నారు. పైగా పెద్ద‌ప‌ల్లి నుంచి త‌న తండ్రి ఎంపీగా, కేంద్ర కార్మిక మంత్రిగా సేవ‌లందించారు. పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో సింగ‌రేణి కార్మికుల ఓట్లు అధికం. సింగ‌రేణి కార్మికులంద‌రికీ వివేక్ తండ్రి వెంక‌ట‌స్వామి అంటే..అంతులేని అప్యాయ‌త‌. వారిని కాద‌ని వ‌రంగ‌ల్లో పోటీ చేసి ఓడితే.. రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యార‌వుతుంద‌ని వివేక్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది.. పైగా 2014లో స్థానికేత‌రుడైన బాల్క‌సుమ‌న్ త‌న‌పై సాధించిన‌ది గాలివాటం గెలుపుగానే వివేక్ ప‌రిగ‌ణిస్తున్నారు. అందుకే తాను పెద్ద‌పల్లిని వీడేది లేద‌ని భీష్మించుకున్నారు. సాక్షాత్తూ.. అధికార పార్టీ త‌మ త‌ర‌ఫున పోటీ చేయ‌మ‌న్నా.. వివేక్ సున్నితంగా తిర‌స్క‌రించ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.
First Published:  29 Oct 2015 11:39 PM GMT
Next Story