Telugu Global
Others

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా సోము వీర్రాజు..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక మార్పులు జరగబోతున్నాయా? ఇటీవల కొందరు బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చేస్తున్న విమర్శలకు కారణం ఇదేనా? త్వరలోనే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? అన్న ప్రశ్నలకు అవునన్న సమాధానమే వస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చంద్రబాబు ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్టు స్థానిక బీజేపీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ బలోపేతం కాకపోవడానికి రథసారథి బలంగా లేకపోవడమే కారణమని బీజేపీ హైకమాండ్ […]

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా సోము వీర్రాజు..?
X

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక మార్పులు జరగబోతున్నాయా? ఇటీవల కొందరు బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చేస్తున్న విమర్శలకు కారణం ఇదేనా? త్వరలోనే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? అన్న ప్రశ్నలకు అవునన్న సమాధానమే వస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చంద్రబాబు ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరితో ఉన్నట్టు స్థానిక బీజేపీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
బీజేపీ బలోపేతం కాకపోవడానికి రథసారథి బలంగా లేకపోవడమే కారణమని బీజేపీ హైకమాండ్ గుర్తించినట్టు తెలుస్తోంది.
అందుకే హరిబాబు స్థానంలో మరో సారథి కోసం వేట మొదలైంది. ఇప్పటికే పలువురి పేర్లను బీజేపీ అగ్రనేతలు పరిశీలించారు. అయితే ఇప్పుడు పార్టీలోఉన్న వారిలో సీనియర్లంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే ఉండడంతో అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం, అర్హతలు ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే ఉన్నాయని తెలుస్తోంది. ఏపీ బీజేపీలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిశితంగా విమర్శిస్తున్న వ్యక్తిగా కూడా సోము వీర్రాజుకు హైకమాండ్ వద్ద గుర్తింపు వచ్చింది.
కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా క్రెడిట్ అంతా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కొట్టేస్తున్నారని వీర్రాజు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు సామాజిక సమీకరణలు కూడా వీర్రాజుకు కలిసి వస్తున్నాయని తెలుస్తోంది. మొత్తం మీద త్వరలోనే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. సోము వీర్రాజుకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది.

First Published:  31 Oct 2015 12:42 AM GMT
Next Story