Telugu Global
Others

కేంద్రాన్ని మోసం చేస్తున్న ఏపీ

మాది సంక్షేమ ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మా పాలన ఉందని గొప్పలకు పోతున్న ఏపీ ప్రభుత్వం బీజేపీ నేతల విమర్శలతో అసలు బండారం బయట పడింది. ఎంతసేపూ రాజధాని నిర్మాణం తప్ప ఇతర శాఖలపై కనీసం దృష్టిపెట్టడం లేదు. సంక్షేమ పథకాల అమలుకు చేయాల్సిన కనీస నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. అంతేకాదు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న 25రకాల పథకాలు ఉన్నాయి. వీటి కోసం […]

కేంద్రాన్ని మోసం చేస్తున్న ఏపీ
X

మాది సంక్షేమ ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మా పాలన ఉందని గొప్పలకు పోతున్న ఏపీ ప్రభుత్వం బీజేపీ నేతల విమర్శలతో అసలు బండారం బయట పడింది. ఎంతసేపూ రాజధాని నిర్మాణం తప్ప ఇతర శాఖలపై కనీసం దృష్టిపెట్టడం లేదు. సంక్షేమ పథకాల అమలుకు చేయాల్సిన కనీస నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. అంతేకాదు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్న 25రకాల పథకాలు ఉన్నాయి. వీటి కోసం రాష్ట్రం ప్రభుత్వం 6,999 కోట్లు అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే కేంద్రం వెంటనే 5వేల 740 కోట్లు కేటాయించింది. ఈ నిధులకు రాష్ట్ర వాటా కింద 3,005కోట్లు జమ చేస్తే 8,745 కోట్లు అవుతాయి. వీటిని రాష్ట్రంలో అమలు చేస్తున్న 25 పథకాల కోసం ఖర్చు చేయాల్సి ఉంది.
అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తన వాటా 3వేల 5కోట్లు జమచేసి ఖర్చుపెట్టకపోవడంతోపాటు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం కుదరడం లేదని తేలింది. కేంద్రంవాటా కింద 5వేల 740 కోట్లు విడుదల చేస్తే ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5వేల 343కోట్లే. అంటే ఇంకా 397కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఖర్చు కాలేదు. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు కేంద్రం 143 కోట్లు ఇస్తే రాష్ట్రం 43కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రం నుంచి 28కోట్లు ఇచ్చినట్టు చూపారు. అయినా ఖర్చు చేసింది మాత్రం 24కోట్లే.
ఇక మహిళ మరియు శిశు సంక్షేమశాఖకు కేంద్రం 510 కోట్లు ఇచ్చింది. రాష్ట్రం వాటాగా 227కోట్లు ఖర్చు చేయాలి. కానీ ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తమే310 కోట్లు. అంటే కేంద్రం వాటాలో 200కోట్లు, రాష్ట్రం ఇవ్వాల్సిన 227కోట్లు ఖర్చు చేయలేదన్నమాట. ఇక సోషల్ వెల్ఫేర్ స్కీముకు కేంద్రం 350కోట్లు ప్రతిపాదనలు పంపితే కేంద్రం 4కోట్లు ఇచ్చింది. రాష్ట్రం మాత్రం అదీ ఇవ్వకుండా కేవలం 2కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మెడికల్ అండ్ హెల్త్ కోసం కేంద్రం 438కోట్లు ఇస్తే.. రాష్ట్ర వాటా కింద 669 కోట్లు ఇవ్వాలి. రాష్ట్రం ఏమీ ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన 438 కోట్లలోనూ 250కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక వ్యవసాయశాఖ కోసం కేంద్రం 259 కోట్లు ఇచ్చింది. రాష్ట్రం ఇవ్వాల్సిన 307కోట్లు ఇవ్వకుండా.. కేంద్రం నిధుల్లో కేవలం 273 కోట్లే ఖర్చు చేస్తోంది.
ఇలా కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులనే పూర్తిగా ఖర్చు చేయని ప్రభుత్వం.. రాష్ట్ర ఖజానా నుంచి మెజారిటీ శాఖలకు పైసా విదల్చలేదు. అందుకే ఇటీవల ఏపీకి చెందిన బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను సరిగా ఖర్చు చేయడం లేదంటూ చేస్తున్న ఆరోపణలు నిజమవుతున్నాయి.

First Published:  31 Oct 2015 12:39 AM GMT
Next Story