Telugu Global
Others

కేసు విత్ డ్రాకు రూ. 5 కోట్లు ఇవ్వజూపిన ఏపీ పెద్దలు

ఏపీ రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాల్లో మూడు పంటలు పండే భూములను లాక్కోవడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో నమోదైన కేసును నీరుగార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసిన జర్నలిస్టు పండలనేని శ్రీమన్నారాయణ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కేసు వేసిన తర్వాత తనకు ఎదురైన అనుభవాలను ఆయన వివరించారు. ప్రభుత్వ చర్యలతో పర్యావరణం దెబ్బతింటుందనే తాను ట్రిబ్యునల్‌ను ఆశ్రయించానని చెప్పారు. మల్కాపురంలో చెరుకు పంట ధ్వంసం […]

కేసు విత్ డ్రాకు రూ. 5 కోట్లు ఇవ్వజూపిన ఏపీ పెద్దలు
X

ఏపీ రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాల్లో మూడు పంటలు పండే భూములను లాక్కోవడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో నమోదైన కేసును నీరుగార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసిన జర్నలిస్టు పండలనేని శ్రీమన్నారాయణ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కేసు వేసిన తర్వాత తనకు ఎదురైన అనుభవాలను ఆయన వివరించారు. ప్రభుత్వ చర్యలతో పర్యావరణం దెబ్బతింటుందనే తాను ట్రిబ్యునల్‌ను ఆశ్రయించానని చెప్పారు.

మల్కాపురంలో చెరుకు పంట ధ్వంసం చేసిన రోజే తన ఇంటిపైనా కొందరు దాడిచేశారని చెప్పారు. ఇంటికి వచ్చి నోటికొచ్చినట్టు తిట్టారన్నారు. ప్రభుత్వ పెద్ద ఒకరు తన దగ్గరకు వచ్చి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు విత్ డ్రా చేసుకునేందుకు ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని శ్రీమన్నారాయణ చెప్పారు. ఐదు కోట్లు తీసుకుని ప్రశాంతంగా బతకాలని సూచించారని వివరించారు. అయితే తాను పుట్టుకతోనే శ్రీమంతుడినని డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

తన వెనుక జగన్ ఉన్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్‌ను ఇప్పటి వరకు తాను నేరుగా చూసింది కూడా లేదన్నారు. ఒక మంత్రి తనను మాజీ జర్నలిస్టు అన్నారని… కానీ జర్నలిస్టుల్లో మాజీ జర్నలిస్టు ఉండరన్న విషయాన్ని మంత్రి గుర్తించుకోవాలని శ్రీమన్నారాయణ సూచించారు. రాజధాని పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని సాక్ష్యాలతో సహా సమర్పిస్తానని చెప్పారు.

First Published:  31 Oct 2015 8:33 AM GMT
Next Story