Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మోత్సవంకు ముహుర్తం ఫిక్స్ చేసిన మహేష్

ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా సెట్స్ పై ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ కాస్త టైమ్ తీసుకుందామనే ఉద్దేశంతో సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు వేసవిలో విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ 8న బ్రహ్మోత్సవాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ తేదీనాటికి సినిమాను పక్కాగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. […]

బ్రహ్మోత్సవంకు ముహుర్తం ఫిక్స్ చేసిన మహేష్
X
ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా సెట్స్ పై ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ కాస్త టైమ్ తీసుకుందామనే ఉద్దేశంతో సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు వేసవిలో విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్ 8న బ్రహ్మోత్సవాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. ఈ తేదీనాటికి సినిమాను పక్కాగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. నిజానికి ఏప్రిల్ అంటే చాలా టైం ఉన్నట్టు లెక్క. దాదాపు 5 నెలల పాటు షూటింగ్ చేసుకోవచ్చు. అంటే శ్రీకాంత్ అడ్డాలకు మహేష్ బాబు చాలానే టైం ఇచ్చాడు. ఎందుకంటే.. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకు కూడా ఇలానే టైం తీసుకున్నాడు అడ్డాల. అందుకే అతడి వర్కింగ్ స్టయిల్ కు తగ్గట్టు తన షెడ్యూల్స్ లో మార్పులు చేసుకున్నాడు మహేష్. సో.. తాజా అప్ డేట్స్ ప్రకారం చూసుకుంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాతే మహేష్ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ వస్తుంది. అప్పటివరకు బ్రహ్మోత్సవంలోనే మహేష్.
First Published:  30 Oct 2015 7:02 PM GMT
Next Story