Telugu Global
Others

ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణపై పోలీసుల‌కు ఫిర్యాదు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిరాధార వార్త‌లు రాస్తూ.. రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ.. ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ క‌న్వీన‌ర్ గోవ‌ర్ద‌న్‌రెడ్డి శుక్ర‌వారం జూబ్లీహిల్స్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. స‌ద‌రు దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిస్తున్న వార్త‌లకు స‌రైన ఆధారాలు లేవ‌ని, అవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాల‌ని ఫిర్యాదులో ఆరోపించారు. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావును అప‌ఖ్యాతి చేయాల‌నే ల‌క్ష్యంతో ఆంధ్ర‌జ్యోతి దినప‌త్రిక‌లో ప‌నిగ‌ట్టుకుని ఇలాంటి వార్త‌లు రాస్తున్నార‌ని ఆరోపించారు. గోవ‌ర్ద‌న్ రెడ్డి ఇచ్చిన ఈ ఫిర్యాదును […]

ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణపై పోలీసుల‌కు ఫిర్యాదు
X

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిరాధార వార్త‌లు రాస్తూ.. రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తున్నారంటూ.. ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ క‌న్వీన‌ర్ గోవ‌ర్ద‌న్‌రెడ్డి శుక్ర‌వారం జూబ్లీహిల్స్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. స‌ద‌రు దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిస్తున్న వార్త‌లకు స‌రైన ఆధారాలు లేవ‌ని, అవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాల‌ని ఫిర్యాదులో ఆరోపించారు. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావును అప‌ఖ్యాతి చేయాల‌నే ల‌క్ష్యంతో ఆంధ్ర‌జ్యోతి దినప‌త్రిక‌లో ప‌నిగ‌ట్టుకుని ఇలాంటి వార్త‌లు రాస్తున్నార‌ని ఆరోపించారు. గోవ‌ర్ద‌న్ రెడ్డి ఇచ్చిన ఈ ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులు స్వీక‌రించారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేస్తారా? ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

దీనికితోడు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై నమస్తే తెలంగాణ పత్రిక తీవ్ర అవినీతి ఆరోపణలు చేసింది. అవిభాజ్య కవలలుగా పుట్టిన వీణా వాణీల పేరుతో ప్రజలనుంచి వసూలు చేసిన విరాళాలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సొంతానికి వాడేసుకున్నాడని ఒక కథనం ప్రకటించింది.

First Published:  30 Oct 2015 11:27 PM GMT
Next Story