కూలిన రష్యా విమానం… 224 మంది దుర్మరణం

రష్యా విమాన ప్రమాద ఘటనలో మొత్తం 224 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు విమాన సిబ్బంది, 17 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకూ 100 మృతదేహాలను వెలికి తీశారు. విమానంలో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు బతికే ఉన్నట్లు తొలుత వార్తలు వచ్చినా ఆ తర్వాత అధికారులు ఆ వార్తలను ఖండించారు. విమానంలో ఉన్నవారందరూ చనిపోయారని ప్రకటించారు. కూలిపోయిన విమానంలో దాదాపు 217 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎక్కువమంది పర్యాటకులే ఉన్నారు. రష్యాకు చెందిన ఎయిర్ బస్ ఎ-321 విమానం ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పం మీదుగా రష్యాకు బయల్దేరిన తర్వాత కొద్దిసేపటికే ఈజిప్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ పరిధిలో దాని సిగ్నల్స్ అందలేదు. రష్యాపై  ఐసీఎస్ ప్రతీకార దాడికి దిగినట్టు ఈజిప్టు భావిస్తోంది.
మేమే కూల్చాం: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు
ఈజిప్ట్‌లోని షామ్ అల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన విమానాన్ని తామే కూల్చామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 224 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు విమాన సిబ్బంది, 17 మంది చిన్నారులు కూడా ఉన్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై రష్యా విమానాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో విమానం కూల్చినట్లు ప్రకటించింది.