Telugu Global
Others

సుజనా చౌదరిపై బిగుస్తున్న ఉచ్చు

కేంద్రసహాయమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మారిషస్ బ్యాంకు వ్యవహారంలో పలుమార్లు నోటీసులు అందుకున్న సుజనా చౌదరికి మరోసారి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించడం లేదంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. తమ బకాయిలు చెల్లించేలా లిక్విడేటర్‌ను నియమించాలని హైకోర్టును మారిషస్ బ్యాంక్ కోరింది. మారిషస్ కమర్శియల్ బ్యాంకు వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు […]

సుజనా చౌదరిపై బిగుస్తున్న ఉచ్చు
X

కేంద్రసహాయమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మారిషస్ బ్యాంకు వ్యవహారంలో పలుమార్లు నోటీసులు అందుకున్న సుజనా చౌదరికి మరోసారి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించడం లేదంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. తమ బకాయిలు చెల్లించేలా లిక్విడేటర్‌ను నియమించాలని హైకోర్టును మారిషస్ బ్యాంక్ కోరింది. మారిషస్ కమర్శియల్ బ్యాంకు వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు డైరెక్టర్లు గా ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థకు కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా నాన్‌ ఎగ్జుక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తన్నారు. అందుకే ఆయనకూ నోటీసులు అందాయి.
ఎక్కడ బిజినెస్ చేయకుండానే తమ నుంచి రుణాలు పొందారని ఇది ఆర్థిక నేరమని గతంలో మారిషిస్‌ కమర్శియల్‌ బ్యాంకు సుజనా యూనివర్శల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థపై కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసులో సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ మొత్తం ఆస్తులు, వ్యాపార వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారం మొత్తం అఫడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని ఈ ఏడాది జూన్‌ 17న సిటి సివిల్ కోర్టు ఆదేశించింది. రూ.106 కోట్లు బకాయిలను చెల్లించాలని హైకోర్టు సూజనా చౌదరికి తెలిపింది. అయితే సుజనా యూనివర్సల్ కంపెనీ యాజమాన్యం బ్యాంకు ఖాతాల వివరాలు కోర్టుకు ఇవ్వలేదు. తర్వాత దాఖలు చేసిన అఫడవిట్‌లోనూ కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలు మాత్రమే ఇచ్చింది. దీనిపై మారిషిస్‌ బ్యాంకు మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పు ఉల్లంఘన కింద మరోసారి నోటీసులు ఇచ్చింది. మరి ఈసారి సుజనా చౌదరి ఏం చేస్తారో చూడాలి.

First Published:  31 Oct 2015 1:05 AM GMT
Next Story