Telugu Global
Others

చంద్రబాబు దౌర్భాగ్య  స్థితిలో ఉన్నారా..?

ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబునాయుడిపై జగన్ మరోసారి తీవ్రంగా స్పందించారు.  ప్రత్యేక హోద  లేదని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసినా కనీసం దాన్ని ఖండించలేని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా జగన్ స్పందించారు. గతంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుందని లోక్‌సభలో ప్రభుత్వం చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు .  ఇంత జరిగాక కూడా కేంద్రంలో టీడీపీ మంత్రులు కొనసాగడం సరికాదని జగన్ అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు దౌర్భాగ్య  స్థితిలో ఉన్నారా..?
X

jagan

First Published:  30 Oct 2015 11:04 PM GMT
Next Story