Telugu Global
Cinema & Entertainment

కోన వెంకట్ మామూలోడు కాదు

శుక్రవారం సాయంత్రం ‘శంకరాభరణం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాలా ఘనంగానే చేసారు నిర్మాత మరియు స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఇది  మీడియం బడ్జెట్ మూవీ ఫంక్షన్‌లా కాకుండా…పెద్ద పెద్ద వాళ్ళని.. ఈ ఫంక్షన్‌కి రప్పించగలిగారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ముంబైలో ఉన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ని సాయంత్రానికి ఫంక్షన్‌కి రప్పించగలిగారు. శుక్రవారం ఉదయం వరకు షూటింగ్ చేసి అలసిపోయి నిద్రపోతున్న, స్టార్ హీరోయిన్ సమంతాని.. ఉదయం పదకొండుగంటలకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి.. అడిగితే […]

కోన వెంకట్ మామూలోడు కాదు
X

శుక్రవారం సాయంత్రం ‘శంకరాభరణం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చాలా ఘనంగానే చేసారు నిర్మాత మరియు స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఇది మీడియం బడ్జెట్ మూవీ ఫంక్షన్‌లా కాకుండా…పెద్ద పెద్ద వాళ్ళని.. ఈ ఫంక్షన్‌కి రప్పించగలిగారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ముంబైలో ఉన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ని సాయంత్రానికి ఫంక్షన్‌కి రప్పించగలిగారు. శుక్రవారం ఉదయం వరకు షూటింగ్ చేసి అలసిపోయి నిద్రపోతున్న, స్టార్ హీరోయిన్ సమంతాని.. ఉదయం పదకొండుగంటలకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి.. అడిగితే కూడా సమంత వెంటనే ఒప్పేసుకుని.. ఫంక్షన్‌కి ముఖ్య అతిధిగా వచ్చేసింది. అన్నింటికన్నా ముఖ్యంగా .. పూజ్యనీయులు కె.విశ్వనాథ్ సూపర్ హిట్ టైటిల్ ‘శంకరాభరణం’ తన సినిమాకి వినియోగించుకున్నదే కాకుండా… విశ్వనాథ్ గారిని ఆడియో వేడుకకు ఆహ్వానించి ప్రత్యేక గౌరవం ఇచ్చి.. టైటిల్ గురించి మొదట్లో గోల చేసిన వారి నోళ్ళు మూయించారు. అందుకే అల్లు అరవింద్ తన స్పీచ్‌లో ‘నేను సరైనోడు టైటిల్‌తో పాటు.. ‘వీడు మామూలోడు కాదు’ అనే టైటిల్ కూడా రిజిష్టర్ చేయించాను. దానికి కోనని హీరోగా పెట్టి ‘కోన, మామూలోడు కాదు’ అనే సినిమా తీస్తే బాగుంటుంది ‘ అని చమత్కరించారు. నిజంగానే కోన మామూలోదు కాదు సుమీ!

First Published:  30 Oct 2015 7:05 PM GMT
Next Story