వెంకటేష్, నయన ఫిక్స్ అయ్యారు

వెంకటేష్ తాజా చిత్రంలో నయనతార నటించే అవకాశముందంటూ ఈమధ్య చాలా పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు వార్తలన్నీ నిజమయ్యాయి. నయన్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేశాడు విక్టరీ వెంకటేష్. తన కొత్త సినిమాలో నయన్ నటిస్తుందంటున్నాడు. త్వరలోనే మారుతి దర్శకత్వంలో రాధ అనే సినిమా చేయనున్నాడు వెంకీ. డిసెంబర్ నుంచి ఈ సినిమా పట్టాలపైకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో తొలి నుంచి నయనతారనే అనుకుంటున్నారు. తాజాగా ఆమెనే కన్ ఫర్మ్ చేశారు. 
నిజానికి నయనతార టాలీవుడ్ కు దూరమైంది.శేఖర్ కమ్ములతో చేసిన అనామిక సినిమా తర్వాత మళ్లీ ఇటువైపు తొంగిచూడలేదామె. తమిళనాట క్రేజ్ ఉండడం, పారితోషికం కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు ఇస్తుండడంతో కోలీవుడ్ కే పరిమితమైపోయింది నయన్. కాల్షీట్లు అన్నీ అక్కడే కేటాయిస్తోంది. వెంకీ చొరవతో ఇప్పుడు తెలుగుతెరపై మరోసారి కనిపించేందుకు సిద్ధమౌతోంది. పైగా రాధ సినిమాలో నయన్ పాత్రకు మంచి వెయిట్ ఉంది. నయనతార ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణం.